సీనియర్ హీరోయిన్ కి చేదు అనుభవం.. రంగంలోకి దిగిన పోలీసులు.!

  • June 5, 2024 / 11:09 AM IST

ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ తప్ప తాగి రోడ్డుపై గొడవ చేసినట్లు.. బాలీవుడ్ మీడియా కోడై కూసింది. దీంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ అయ్యింది. బాలీవుడ్ సెలబ్రిటీల పై ఇలాంటి ప్రచారం జరిగితే వెంటనే నిజమని నమ్మేసే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే బాలీవుడ్ సెలబ్రిటీలపై ఉన్న నమ్మకం అలాంటిది. అయితే జరిగింది వేరు. వివరాల్లోకి వెళితే.. సీనియర్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) ఫుల్లుగా తాగేసి రోడ్డుపై గొడవ చేసింది అంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపించాయి.

అయితే వీటిని ముంబయి పోలీసులు కొట్టి పారేశారు. అలాగే అసలు విషయాన్ని కూడా వాళ్ళు బయట పెట్టారు. వారి సమాచారం ప్రకారం.. రవీనా ఇంటికి దగ్గర్లో కారుని పార్క్ చేయడానికి ఆమె డ్రైవర్ ప్రయత్నించాడట. కారు రివర్స్ చేస్తున్న క్రమంలో ఓ మహిళను ఢీ కొట్టినట్టు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ మహిళ అరుపులతో చుట్టుపక్కల ఉన్న వారంతా గుమికూడారు. అలాగే ఆ డ్రైవర్ పై గొడవకు దిగారు. దీంతో రవీనా టాండన్ కారు దిగి బయటకు వచ్చి తన డ్రైవర్ ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ఆమె డ్రైవర్ పై కొంతమంది చెయ్యి చేసుకుంటున్న టైంలో.. అతన్ని కొట్టొద్దు అంటూ ఆమె గట్టిగా అరిచిందట. దీంతో ఆమె తప్ప తాగి రోడ్డుపై గొడవకి దిగినట్టు కొంతమంది ప్రచారం చేశారు. కానీ పోలీసులు దర్యాప్తులో అది అసత్య ప్రచారం అని తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత రవీనా కారు.. ఆ మహిళను ఢీ కొట్టలేదని తేలిందట. అలాగే రవీనా కూడా మద్యం సేవించలేదని పోలీసులు వెల్లడించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus