బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటోల వివాదం ఎంతటి పరిణామాలకు దారితీసిందో మనకు తెలిసిందే. ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం ఈయన న్యూడ్ ఫోటోషూట్ చేసిన అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.ఈ క్రమంలోనే ఎంతోమంది ఈయన వ్యవహార శైలిని తప్పుపడుతూ ఆయన పై తీవ్ర విమర్శలు చేశారు. రణవీర్ సింగ్ ఈ విధంగా న్యూడ్ ఫోటోషూట్ చేయడమే కాకుండా ఆ ఫోటోలను షేర్ చేయడంతో మహిళల మనోభావాలను దెబ్బతీసారంటూ ఎంతోమంది మహిళా సంఘాల నేతలు విమర్శలు చేస్తూ ఈయనపై ఫిర్యాదులు కూడా చేశారు.
ఇక ఈ వ్యవహారపై పెద్ద ఎత్తున ఈయనని కొందరు విమర్శించగా మరికొందరు మాత్రం ఈయనకు మద్దతుగా నిలబడ్డారు. ఇలా న్యూడ్ ఫోటోల వివాదం తారస్థాయికి చేరగా తాజాగా ఈ విషయంపై నటుడు రణవీర్ కి ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ న్యూడ్ ఫోటో వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు ఈయనకు సమన్లు జారీ చేశారు. ఈనెల 22వ తేదీ ఈయన విచారణకు హాజరుకావాలని పోలీసులు వెల్లడించారు.
స్వయంగా ముంబై పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు అందించగా ఆ సమయంలో నటుడు ఇంట్లో లేకపోవడం గమనార్హం. ఆగస్టు 22వ తేదీ ముంబై పోలీసులు ఈయనను ఈ విషయంపై విచారణ జరపడమే కాకుండా ఆయన స్టేట్మెంట్ రికార్డు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈయన ఈ విధంగా న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో శ్యామ్ మంగారాం ఫౌండేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇలాంటి ఫోటోల ద్వారా మహిళల మనోభావాలను కించపరిచారు అంటూ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇలాంటి విషయాలను వ్యతిరేకించకుండా చూసి చూడనట్టు వదిలేస్తే ఇదే బాటలోనే మరి కొంతమంది కూడా వ్యవహరించే ప్రమాదం ఉంటుందన్న సదరు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేశారు.