Murali Mohan, Pawan Kalyan: పవన్‌ సీఎం.. మురళీ మోహన్‌ కామెంట్స్‌ వైరల్‌!

చాలా రోజులుగా సినిమాల గురించి, ఏపీ పాలిటిక్స్‌ గురించి మాట్లాడని ప్రముఖ నటుడు, రాజకీయ నాయుడు మురళీ మోహన్‌ ఇటీవల మీడియాతో వరుసగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో చాలా విషయాలు చెబుతున్నారు. అందులో టీడీపీ గురించి, జనసేన గురించి చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఆయన మెగా కుటుంబం గురించి, పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రయాణం గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆ విషయాలు వైరల్‌గా మారాయి. తన కాలెక్యులేషన్స్‌ కరెక్ట్‌ అయితే…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో రోజు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని మురళీమోహన్ అన్నారు. యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరంగా ఉన్న మురళీ మోహన్… పార్టీలు – పాలిటిక్స్ గురించి మాట్లాడను అంటూ.. జనసేన ఫీచర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారు. కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు, వారి వల్ల కాకపోతే వెనక్కి వెళ్లిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. పొలిటికల్‌గా సక్సెస్ అయినా, అవ్వకపోయినా… పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుతున్నాడు. ఏదో ఒకరోజు ఆయన మంచి స్థానానికి వెళ్తాడు అని మురళీ మోహన్‌ అన్నారు.

పవన్‌ తప్పుకుండా ముఖ్యమంత్రి అవుతాడు. అయితే ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను. ఏదో రోజు పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూస్తాం. అది జరిగిన రోజున మా సినిమా వాళ్ల నుండి మరొకరు ముఖ్యమంత్రి అయ్యారని గర్వపడతాను అని చెప్పుకొచ్చారు మురళీ మోహన్‌. పవన్ కళ్యాణ్‌తో తాను ఎప్పుడూ రాజకీయాల గురించి మాట్లాడలేదని కానీ, రాజమహేంద్రవరం నుండి తాను పోటీ చేసినప్పుడు బీజేపీ, జనసేన తనకు సపోర్ట్ చేశాయని చెప్పారు.ఆ సమయంలో పవన్‌ తన తరఫున ప్రచారం చేశాడని గుర్తు చేసుకున్నారు.

మెగా బ్రదర్స్‌లో పవన్ కళ్యాణ్‌తో ఎప్పుడూ అంత క్లోజ్‌గా లేనని చెప్పారు మురళీ మోహన్‌. తన పని తాను చేసుకుని వెళ్లిపోతుంటాడు పవన్‌. మిగిలిన విషయలు పెద్దగా పట్టించుకోడు. చిరంజీవి ఈ విషయంలో వేరేలా ఉంటాడు. ‘‘ఫోన్ చేస్తే ఏంటన్నయ్యా ఏం చేస్తున్నావ్ సరదాగా షూటింగ్‌కి రావొచ్చుగా’ అంటుంటాడు. పవన్‌తో బాగున్నారా అంటే బాగున్నారా? అంతవరకే ఉంటుంది అని చెప్పారు మురళీ మోహన్‌.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus