టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ (Allu Arjun) వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా కచ్చితంగా రిలీజ్ కావాలని ఈ సినిమా ఆ తేదీకి రిలీజ్ కాని పక్షంలో ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో నిరాశకు గురయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపించాయి. పుష్ప ది రైజ్ లో (Pushpa) బన్నీ అభినయానికి జాతీయ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే అల్లు అర్జున్ కు అవార్డ్ వచ్చినా టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రశంసలు రాలేదు. ప్రముఖ నటుడు మురళీ మోహన్ (Murali Mohan) సైతం ఇవే విషయాలను ప్రస్తావించారు. సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ ఈవెంట్ లో మురళీ మోహన్ మాట్లాడుతూ బన్నీకి జాతీయ అవార్డ్ వస్తే సినిమా ఇండస్ట్రీ కనీసం సత్కరించలేదని పేర్కొన్నారు. ఇండస్ట్రీ చెన్నైలో ఉన్న సమయంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు.
చిరంజీవినైనా (Chiranjeevi) పద్మవిభూషణ్ వచ్చినందుకు గౌరవిస్తున్నారని అందుకు సంతోషంగా ఉందంటూ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు మురళీ మోహన్ పరోక్షంగా చురకలు అంటించారు. మురళీ మోహన్ చేసిన కామెంట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి. బన్నీ పుష్ప ది రూల్ సినిమాతో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బన్నీ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బిజినెస్ పరంగా కూడా బన్నీ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది రిలీజ్ కానున్న సినిమాలలో కల్కి 2898 ఏడీ(Kalki), పుష్ప2, దేవర (Devara), ఓజీ (OG Movie), గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడగా ఈ సినిమాలలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.
ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!
లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?