Murari Bava Song: ‘సర్కారు వారి పాట’ టీంకి ఇంకా నమ్మకం ఉందా?

మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. పరశురామ్ బుజ్జి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తొలి రోజు మిక్డ్స్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద అలా కలెక్ట్ చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరిచే విషయం. ఆల్రెడీ రూ.108 కోట్ల షేర్ వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఆ టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు.

పైగా ఈ వారం ‘ఎఫ్3’ కూడా విడుదల కాబోతుంది. దిల్ రాజు సినిమా కాబట్టి పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఎఫ్ 2’ సీక్వెల్ హిట్ అవ్వడం కూడా ఈ మూవీ పై హైప్ ఏర్పడడానికి కారణంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ‘సర్కారు వారి పాట’ మూడో వీకెండ్ ను క్యాష్ చేసుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. అందుకోసమే చిత్ర బృందం ఓ డెసిషన్ తీసుకుంది. ఈ సినిమాలో ‘మురారి వా బావ’ అంటూ సాగే ఓ మెలోడీ పాట ఉంది.

దానిని త్వరలోనే సినిమాలో యాడ్ చేస్తామన్నట్టు చిత్ర బృందం చెప్పుకొచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఎఫ్3’ విడుదల రోజు నుండే ‘సర్కారు వారి పాట’ లో ఆ పాటని జత చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. దాదాపు ఇది ఖరారు అయినట్టే..! బుధవారం, లేదా గురువారం రోజున అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ పాటని జత చేయడం వల్ల ‘ఎఫ్3’ పోటీని తట్టుకోవచ్చు అలాగే రిపీట్ ఆడియెన్స్ కూడా వస్తారని ‘సర్కారు వారి పాట’ టీం భావిస్తోంది. మరి వాళ్ళ నమ్మకం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి..! ఇక ‘మురారి బావ’ పాటకి కూడా అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా తమన్ అందించిన ట్యూన్ బాగుంటుంది, శ్రోతల్ని మెప్పిస్తుంది అంటూ టీం చెప్పుకొస్తుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus