Thaman: సినిమా డబ్బులే నావి.. మిగిలినవి ఆ పనికే.. క్లారిటీ ఇచ్చిన తమన్‌!

వరుస సినిమాలు చేస్తూనే.. కాన్సర్ట్‌లు, ఓటీటీ షోలు, సెలబ్రిటీ క్రికెట్‌, ఛారిటీ షోలు చేస్తుంటారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ (S.S.Thaman). గత కొన్నేళ్లుగా ఆయన ఈ స్టయిల్‌లోనే వెళ్తున్నారు. కొన్నిసార్లు ఈ కారణంగానే ఆయన సినిమాలకు సమయానికి మ్యూజిక్‌ అందించరు అనే అపవాదులు కూడా ఎదుర్కొన్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు, కారణమేంటి అనే వివరాలను ఓ కార్యక్రమంలో వివరించారు తమన్‌. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమన్‌ త్వరలో ఓ మ్యూజికల్ కాన్సర్ట్ చేస్తున్నారు.

Thaman

ఈ నేపథ్యంలోనే మీడియా ముందుకు వచ్చిన తమన్‌ తన సంపాదన గురించి, ఛారిటీల గురించి వివరించారు. సినిమాల నుండి వచ్చిన డబ్బులని మాత్రమే సొంతానికి వాడతానని, క్రికెట్, ఇతర షోలు, కాన్సర్ట్‌లు ద్వారా వచ్చే డబ్బు సామాజిక కార్యక్రమాల కోసమే వాడుతాను అని చెప్పాడు. దీంతో ఆయన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. తనకు ఎంతో ఇచ్చిన ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తమన్ చెప్పాడు.

వృద్ధాశ్రమాలు, సేవా కార్యక్రమాలు, దానాలు లాంటి తమన్‌ లైఫ్‌లో కీలకం. తను చిన్నతనంలో పడ్డ ఇబ్బందులు ఇతరులకు వద్దు అని.. అందుకే తన చేతనైంది సాయం చేస్తానని గతంలో ఓ సందర్భంలో చెప్పారు. ఇప్పుడు ఎలా చేస్తోంది అనే విషయం చెప్పారు. తమన్‌ సినిమాల సంగతి చూస్తే.. మొన్న సంక్రాంతికి ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer), ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) సినిమాలతో వచ్చారు.

నెక్స్ట్‌ ఆయన లైనప్‌లో సిద్ధు జొన్నలగడ్డ – నీర కోన ‘తెలుసు కదా’, ‘శబ్దం’ (Sabdham), ప్రభాస్ (Prabhas) – మారుతి (Maruthi Dasari) ‘ది రాజా సాబ్‌’ (The Rajasaab), గోపీచంద్‌ మలినేని (Gopichand Malineni) – సన్నీ డియోల్‌ (Sunny Deol) ‘జాట్‌’ (Jaat), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) – సుజీత్‌ (Sujeeth) ‘ఓజీ’ (OG), బాలకృష్ణ (Nandamuri Balakrishna) – బోయపాటి శ్రీను (Boyapati Srinu) ‘అఖండ 2’ ఉన్నాయి. ఇవి కాకుండా మరికొన్ని కొత్త సినిమాలు ఓకే చేస్తున్నారు. వీటిలో ‘అఖండ 2’, ‘ఓజీ’ మీద అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ల కాంబో అలాంటిదిమరి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus