టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో మరే మ్యూజిక్ డైరెక్టర్ కు లేనన్ని ఆఫర్లు థమన్ చేతిలో ఉన్నాయి. అయితే తాజాగా థమన్ కోబోర్డ్ ప్లేయర్ విషయంలో దాతృత్వాన్ని చాటుకున్నారు. కీ బోర్డ్ ప్లేయర్, ప్రోగ్రామర్ కమల్ కుమార్ కరోనా బారిన పడి మృతి చెందారు. ఈ విషయం తెలిసిన థమన్ కమల్ కుమార్ ఆస్పత్రి బిల్లు 90వేల రూపాయలు చెల్లించారు.
కమల్ కుమార్ కొడుకు చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తానని థమన్ చెప్పినట్టు తెలుస్తోంది. కమల్ కుమార్ థమన్ దగ్గర పని చేయడంతో పాటు మరి కొందరు సంగీతదర్శకుల దగ్గర కూడా పని చేశారు. కమల్ కుమార్ కుటుంబం కష్టాలు తెలిసి థమన్ సహాయం చేసినట్లు తెలుస్తోంది. థమన్ సాయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో థమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు సహాయం చేస్తున్నా చాలామంది సెలబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు.
థమన్ మాదిరిగా అందరూ స్పందించి కరోనా వల్ల కష్టాలు పడుతున్న ప్రజలకు తమ వంతు సహాయం అందించాలని నెటిజన్లు కోరుతున్నారు. థమన్ సాయం చేసినప్పటికీ ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకపోవడం గమనార్హం. సాయం చేసిన కొంతమంది సెలబ్రిటీలు ఆ సాయాన్ని జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ థమన్ మాత్రం వారికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.