అంచనాలను అందుకోలేని రమ్యమైన రాగాలు

ఒక పాట ఎంతో మందిని కదిలిస్తుంది అని మన ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎన్నో సార్లు చెప్పారు. అయితే ఇప్పుడున్న కాలంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ టెక్నాలజీ పుణ్యమా అంటూ ఎంటర్‌టేన్‌మెంట్ కోసం అనేక మార్గాలు ఉన్నాయి కానీ…ఆ రోజుల్లో అయితే రేడియోలో పాటల కోసం పరవశించిపోయే హృదయాలు చాలా ఉండేవి. అయితే ఆ కధ అంతా పక్కన పెడితే మన టాలీవుడ్ లో సంగీత దర్శకుల్లో ఎంతో ప్రతిభ కలిగి తమ మ్యూజిక్ తో సినిమాను బ్రతికించగలిగే బలమైన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. అయితే ఎంత గొప్పవారికైన అపజయాలు మామూలే, ఇంకా చెప్పాలి అంటే అపజయం అన్న పదం లేకపోతే ఆ పదంలోనుంచి జయం అన్న పదం పుట్టేది కాదేమో. మరి తమ ట్యూన్స్ తో సినిమాకి ప్రాణం పోయగల మ్యూజిక్ డైరెక్టర్స్ వారు చేసిన సినిమాల్లో అనుకోకుండానో, లేక అసంధర్భంగానో కొన్ని సినిమాలు మ్యూజిక్ పరంగా చాలా నిరాశ పరిచాయి అనే చెప్పాలి…మరి అలా నిరాశ పరిచిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు…ఆ సినిమాలు ఏంటో ఒక లుక్ వేద్దాం రండి….

దేవి శ్రీ ప్రసాద్మన యువ సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఇష్టం లేని వారు ఉండరు…దాదాపుగా అన్ని సినిమాకు హిట్ మ్యూజిక్ అందించిన మన దేవి…2002లో రిలీజ్ అయిన కలుసుకోవాలని సినిమాకి మాత్రం డిజాష్టర్ మ్యూజిక్ అందించాడు. అయితే ఈ సినిమా “చెలియా చెలియా” అనే సాంగ్ బాగా ఫేమస్ అయ్యి ఎంత మంచి పేరు తెచ్చుకుందో…”పదే పదే” అనే ఎందుకు పనికిరాకుండా పోయి, ‘మోస్ట్ అండర్ రేటెడ్’ సాంగ్ గా బాగా నేమ్ తెచ్చుకుంది.

ఎమ్.ఎమ్ కీరవాణితెలుగు సినిమా చరిత్రలో కీరవాణి పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగినది ఆనందంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఎన్నో సినిమాలకు తన మ్యూజిక్ తో ప్రాణం పోసిన కీరవాణి సైతం కొన్ని సినిమాలకు అనుకున్నంత, ఇంకా చెప్పాలి అంటే ఆయన రేంజ్ కి తగ్గట్టుగా మ్యూజిక్ ఇవ్వలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి…2003వ సంవత్సరంలో ఆయన చేసిన ఒకరికి ఒకరు అనే సినిమా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఆ సినిమాలో నువ్వే ‘నా శ్వాస’అనే పాట మినహా మిగిలిన పాటలు అంచనాలను అందుకొలేదు అనే విమర్శలు వినిపించాయి.

సందీప్ చౌతాఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలోనే అవకాశాలు దొరక్క చీకట్లోకి వెళ్ళిపోతారు. మరి అలాంటి వాళ్ళలో మన మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా ఒకడు. బహుశా ఈ పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చుకాని, నాగ్ కరియర్ లో క్ల్యాసికల్ మూవీ అయిన నిన్నే పెళ్ళాడతా సినిమాకి మ్యూజిక్ అందించింది ఈ మ్యూజిక్ దర్శకుడే. అయితే అదే నమ్మకంతో నాగ్ మరోసారి తన కొడుకు డెబ్యూ మూవీ జోష్ కి 2009లో అవకాశం ఇచ్చినప్పటికీ ఆ సినిమాకి మన సందీప్ మంచి మ్యూజిక్ ఇవ్వలేక పోయాడు అనే చెప్పాలి…’ఎవరికీ కనపడదే’ అనే పాత మినహా…మిగిలిన పాటలు అన్నీ ఎక్కడా విన్నట్టుగా అనిపించవ్.

ఏ.ఆర్. రెహ్మాన్ఈ పేరే ఒక ప్రభంజనం…ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెహ్మాన్ మ్యూజిక్ అంటే అందరూ చెవులు కోసుకుంటారు. అయితే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘కొమరమ్ పులి’ సినిమా విషయం మాత్రం మినహాయింపు. 2010లో భారీ అంచనాల నడుమ విడుదలయిన ఈ సినిమా పాటలు భారీ డిజాస్టర్ గా మారి రెహ్మాన్ కరియర్ లోనే ఒక మచ్చగా మిగిలాయి అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ‘దోచేయ్..దోచేయ్’ అంటూ శ్రీయ గోషల్ ఆలపించిన ఈ పాత శ్రియ అందాలు ఆస్వాదించిన వారికి మినహా ఎక్కువ మందికి తెలియకపోవడం విశేషం. మొత్తంగా ఈ సినిమాలో పాటలు పెద్దగా వినిపించలేదు అనే చెప్పాలి.

ఎస్.ఎస్.థమన్ఈ యువ సంగీత దర్శకుడు అనుకోకుండా, ఒక ధృవతారలాగా, దూసుకుపోయి, ఫాస్ట్ గా 50సినిమాలకి మ్యూజిక్ అందించేసాడు. అయితే సినిమాల జయాపజయాలు ఎలా ఉన్నా…మ్యాగ్సిమమ్ మంచి మ్యూజిక్ అందించాడు. పూర్తి మాస్ సినిమా మ్యూజిక్ అందించే థమన్ తన ప్రయత్నాల్లో భాగంగా 2012లో “లవ్ ఫేల్యూర్” సినిమాకి మ్యూజిక్ అందించాడు. అదీ పూర్తి మెలొడీస్ ను అందించాడు తొలిసారి. కట్ చేస్తే మాస్ మహారాజా క్లాస్ సినిమా చేసినట్లు తయారయింది మన వాడి పరిస్థితి. అటు సినిమా పోయింది, ఇటు పాటలు పెద్దగా ఎవ్వరికీ వినిపించలేదు. అయితే ‘ఇంతెజారే…ఇంతెజారే…’ అనే పాట మాత్రం మంచి మెలొడీ గా గుర్తింపు పొందడం విశేషం.

యువన్ శంకర్ రాజాతమిళ టాప్ మ్యూజి డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఎన్నో సినిమాలకు టాప్ హిట్ మ్యూజిక్ అందించాడు. అయితే అదే క్రమంలో మన తెలుగులో సైతం మంచి సినిమాలకు మంచి మ్యూజిక్ అందించైనా యువన్ 2012లో మన మంచు మనోజ్ చేసిన మిస్టర్. నూకయ్య సినిమాకి తనదైన స్టైల్ లో మంచి మ్యూజిక్ నే ఇచ్చాడు. అయితే పాటలు చాలా బావున్నప్పటికీ, ఆ మ్యూజిక్ మన మనిజ్ కరియర్ లోనే బెస్ట్ మ్యూజిక్ అయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం ఆ పాటలు పెద్దగా రుచించలేదు అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ‘ఒకే ఒక జీవితం’ అనే పాట మాత్రం చాలామందికి ఫ్యావరెట్ సాంగ్ అనే చెప్పాలి.

శేఖర్ చంద్రఈ యువ దర్శకుడు నచ్ఛావులే, మనసారా…వంటి చిన్న సినిమాలకు మంచి మ్యూజిక్ అందించి తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే అదే తరుణంలో 2012లో తనిష్ నటించిన మేం వయసుకు వచ్చాం అనే సినిమాకి అవకాశం దొరికింది, ఆ సినిమాకి సైతం మంచి మ్యూజిక్ అందించాడు మన శేఖర్, కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మ్యూజిక్ తెరమరుగు అయిపోయింది. కానీ ఈ సినిమాలో ‘మనసుకు ఏమయిందో’ అని ఆంజనా సౌమ్య పాడిన పాట మంచి పేరు తెచ్చుకోగా….ఇప్పటికీ ఈ సినిమాలో ‘వెళ్ళిపోకే…వెళ్ళిపోకే’ అనే పాట బెస్ట్ బ్రేక్ అప్ సాంగ్ గా మంచి పేరు తెచ్చుకుంది.

మణిశర్మమెలొడీ బ్రహ్మ మణిశర్మ…ఈ సీనియర్ సంగీత దర్శకుడు ఎంత మంది బడా హీరోలకు ఎలాంటి హిట్స్ ఇచ్చాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఒకానొక క్రమంలో అయితే ఎక్కడ విన్నా ఈయాన పేరే వినిపించేది. అయితే అలాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ 2014లో లో’బసంతి’ అనే సినిమాకి మ్యూజి ఇచ్చాడని చాలా మందికి తెలీదు. ఇంకా చెప్పాలి అంటే అసలు ఈ సినిమా ఉన్నట్లే చాలా మందికి తెలీదు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ సినిమాలో ‘ప్రతీ క్షణం’ అనే పాటను దినకర్ అనే యువ గాయకుడు పాడి అందరినీ పరవసింపజేశాడు. మొత్తంగా ఈ ఒక్క పాత మినహా మిగిలిన పాటలు పెద్దగా మన వాళ్ళకి రుచించలేదు అనే చెప్పాలి.

మిక్కి.జే. మేయర్మెలొడీస్ కి మంచి ఫీల్ తెచ్చిన మిక్కి.జే మేయర్ ఎన్నో మంచి పాటలకు ప్రాణం పోశాడు. అయితే 2014లో చక్కిలిగింత సినిమాకు ఆయన ఇచ్చిన మ్యూజిక్ మంచి ఫీల్ మ్యూజిక్ అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా లైమ్‌లైట్ లో లేకపోవడంతో ఈ సినిమాలోని పాటలు సైతం ఎవ్వరూ పెద్దగా వినలేదు. అయితే ఈ సినిమా పాటల్లో టైటిల్ సాంగ్, ‘మాయో మాయో’ ‘అవాయ్డ్ గర్ల్స్’ సాంగ్స్ వినడానికి బావుంటాయి చెప్పాలి.

గోపి సుందర్చిన్న సినిమాలకు తనదైన శైలిలో మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ ను అందిస్తున్న యువ సంగీత దర్శకుడు గోపి సుందర్. అయితే ఈ యువ దర్శకుడు సంగీతం అందించిన చిత్రాల్లో ‘సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు’ సైతం మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. కానీ ఈ సినిమాలోని పాటలు మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకొలేదు అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ‘పరవసమె’ అనే పాట మాత్రం మంచి మెలొడీ గా మంచి పేరు సంపాదించుకుంది.

మొత్తంగా చూసుకుంటే మన సంగీత దర్శకులు అందించిన మధురమైన గీతాల్లో మనం మిస్ అయినవి ఎన్నో ఉన్నాయన్న మాట…మరి వీలుంటే ఒక్కసారి అలా మిస్ అయిన పాటలు అన్నీ ఒక్క లుక్ వేస్తే పోలా…

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus