స్టార్ హీరోయిన్ ఖుష్బూ అందరికీ సుపరిచితమే. 1986 వ సంవత్సరంలో వచ్చిన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఈ 37 ఏళ్లలో తెలుగులో చేసినవి కేవలం 21 సినిమాలే కావడం గమనార్హం. ఇప్పుడు ‘రామ బాణం’ సినిమాలో నటించింది. దీంతో 22 సినిమాలు అవుతాయి. అయితే తెలుగులో ఖుష్బూకి సరైన పాత్రలు దొరకలేదు అని అంతా అనుకుంటారు. ‘చంటి’ వంటి కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తే ఈమె మిస్ చేసుకుంది.
చిరంజీవికి అక్క పాత్ర మాత్రమే చేయగలిగింది. ఒక యాడ్ లో మాత్రమే భార్యగా నటించింది. బాలయ్య సరసన ఒక్క సినిమాలో కూడా నటించలేకపోయింది. అన్నీ ఎలా ఉన్నా తెలుగులో ఈమెకు మంచి పాత్రలు దొరకలేదు అని అంతా భావిస్తుంటారు. ఇదిలా ఉండగా.. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘వారసుడు’ సినిమాలో ఈమె నటించింది. ఆమె షూటింగ్లో పాల్గొన్న టైంలో కూడా కొన్ని ఆన్ లొకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ సినిమాలో ఆమె పాత్ర లేదు.
అయితే ‘వారసుడు’ లో ఈమె (Kushboo) మొదటి భర్త ప్రభు కూడా నటిస్తున్నాడు అని తెలిసి ఈమె షూటింగ్లో నుండి వెళ్ళిపోయింది అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఖుష్బూ. ‘నేను ‘వారసుడు’ సినిమాలో నటించింది నిజం. కానీ ఫైనల్ వెర్షన్లో లెంగ్త్ ఎక్కువగా వచ్చేసింది.
నా పాత్రకు సంబంధించి వేరే పోర్షన్ ఉంటుంది. అది 15 నిమిషాల పాటు ఉంటుంది. ఫైనల్ గా చేసేదేమి లేక నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ నా పాత్రకు సంబంధించిన పోర్షన్ ను తొలగించారు’ అంటూ ఖుష్బూ తెలిపింది.