Nandamuri Mokshagna: పౌరాణిక పాత్రలో మోక్షజ్ఞ.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అంటూ?

  • July 29, 2024 / 04:57 PM IST

నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా షూట్ ఈ ఏడాదే మొదలుకానుందని ప్రశాంత్ వర్మ (Prasanth Varma)  డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని క్లారిటీ వచ్చేసింది. యాక్టింగ్ కు సంబంధించి మోక్షజ్ఞ ఇప్పటికే ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మహాభారతంలో అభిమన్యుడి పాత్ర రిఫరెన్స్ తో మోక్షజ్ఞ రోల్ ను ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దారని కొన్ని నిమిషాల పాటు అభిమన్యుడిగా కూడా మోక్షజ్ఞ కనిపించనున్నారని సమాచారం అందుతోంది. వైరల్ అవుతున్న వార్త నిజమైతే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే సరికొత్త రికార్ద్స్ క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

మోక్షజ్ఞ పుట్టినరోజుకు మరో 5 వారాల సమయం ఉండగా మోక్షజ్ఞ పుట్టినరోజున ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫాంటసీ సోషల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని భోగట్టా.

తెర వెనుక ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగ్తుతున్నాయని తెలుస్తోంది. ఫస్ట్ మూవీతోనే మోక్షజ్ఞకు మెమరబుల్ హిట్ దక్కేలా బాలయ్య (Balakrishna)  ప్లాన్స్ ఉన్నాయని భోగట్టా. 2025లో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కచ్చితంగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ సొంత బ్యానర్ లోనే తెరకెక్కనుందని తెలుస్తోంది.

మోక్షజ్ఞ ఈ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారనే చర్చ కూడా జరుగుతుండటం గమనార్హం. మోక్షజ్ఞ కెరీర్ పరంగా భారీ విజయాలను అందుకుంటే నందమూరి ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. నందమూరి మోక్షజ్ఞ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ పంచుకుంటున్నారు. ఫస్ట్ మూవీతోనే రిస్క్ చేస్తున్న మోక్షజ్ఞ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus