భారీ నిర్మాతల బాలీవుడ్‌ ప్లాన్‌ భలే కదా

టాలీవుడ్‌ భారీ ఎంట్రీ ఇచ్చి… ఈ ఫ్రెండ్స్‌ మామూలు వాళ్లు కాదు ఇండస్ట్రీలో తమదైన మార్క్‌ వేశారు. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు చేసుకుంటూ స్టార్ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రెస్‌గా నిలిచారు. ఇప్పుడు తమ నెక్స్ట్‌ టార్గెట్‌ను బాలీవుడ్‌గా ఎంచుకున్నారు. దాని కోసం సౌత్‌ నుండి తొలి పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ను ఎంచుకున్నారు. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఇదంతా ఎవరి కోసమే… వాళ్లే ప్రొడ్యూసర్‌ ఫ్రెండ్స్‌ మైత్రీ మూవీ మేకర్స్. అవును మీరు చదివింది నిజమే. మైత్రీ వాళ్లు బాలీవుడ్‌కి వెళ్తున్నారట.

ప్రభాస్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ ఓ సినిమా చేస్తుందని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే దర్శకుడు ఎవరు, ఎప్పుడు అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. అయితే వీటికి అదిరిపోయే సమాధానం ఇప్పుడు దొరుకుతోంది. ఎందుకంటే ప్రభాస్‌తో చేయబోయే సినిమాకు దర్శకుడు తెలుగాయన కాదు, తమిళం కాదు… అసలే సౌతే కాదు. ఏకంగా బాలీవుడ్ నుండి తీసుకొస్తున్నారట. అంతేకాదు ఆ సినిమా ఎప్పటిలాగే పాన్‌ ఇండియా సినిమా అట. దాంతోనే మైత్రీ మూవీ మేకర్స్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

బాలీవుడ్‌లో వార్‌ లాంటి సూపర్‌ హిట్‌ సినిమా ఇచ్చిన సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఇటీవల ప్రభాస్‌కు కథ చెప్పాడని వార్తలొచ్చాయి. ‘రాంబో’ సినిమా రీమేక్‌ అని కూడా తెలిసింది. ఎవరో బాలీవుడ్‌ వాళ్లు తీస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఆ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లే నిర్మాతలట. దీని కోసం ఇప్పటికే సిద్ధార్థ్‌ ఆనంద్‌కు పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశారట. అలా ప్రభాస్‌ ఖాతాలో మరో సినిమా కూడా ఓకే అయిపోయిందట. దీంతో మొత్తంగా ప్రభాస్‌ చేతిలో ఓకే అయిన సినిమాలు ఐదు ఉన్నాయి.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus