అనౌన్స్ చేయలేదు కానీ.. ఆగిపోయింది అంటే స్పందించారు.. ఏంటిది?

రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)  – ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది, టీజర్‌ షూటింగ్‌ మొదలైంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కడా ఈ సినిమా గురించి టీమ్‌ మాట్లాడింది లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్‌ ఉందా? లేదా? పుకార్లు మాత్రమేనా అని చర్చలు మొదలయ్యాయి. హీరో, దర్శకుడు ఎవరనేది తెలిసింది కానీ.. నిర్మాత ఎవరు అనేది తెలియలేదు. ఈ సినిమా అనౌన్స్మెంట్‌ కోసం వెయిట్‌ చేసిన ఫ్యాన్స్‌కి క్లారిటీ ఇచ్చేశారు.

రణ్‌వీర్‌ – ప్రశాంత్‌ సినిమా ఎనౌన్స్‌మెంట్‌ కోసం ఇన్నాళ్లూ వెయిట్‌ చేసిన జనాలు.. ఇక ఆ ప్రాజెక్ట్‌ లేదు అంటూ ఓ పుకారు మొదలైంది. సినిమా ఉందా? లేదా? అనే విషయంలో ఇన్నాళ్లూ ఓపెన్‌ అవ్వని సినిమా నిర్మాణ సంస్థ ఇప్పుడు స్పందించింది. ఈ ప్రాజెక్ట్‌ రద్దయినట్లు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. క్రియేటివ్‌ డిఫరెన్స్‌ల వల్ల ఈ సినిమా ఆగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని క్లారిటీ ఇచ్చారు.

సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ఇటీవలే ఫొటో, ప్రోమో షూట్‌ పూర్తయిందని టీమ్‌ వెల్లడించింది. జూన్‌ ఆఖరి వారంలో ఈ సినిమా ప్రచార చిత్రాలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సినిమా టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలపై అప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ హ్యాపీగా ఉన్నారు. అయితే టీమ్‌ ఇలా అనౌన్స్‌ చేయడంపై మీమర్స్‌, నెటిజన్లు మరో విధంగా హ్యాపీగా ఉన్నారు.

సినిమా గురించి రకరకాల వార్తలు వచ్చినా స్పందించని టీమ్‌.. ఇప్పుడు సినిమా ఆగిపోయింది అనేసరికి రియాక్ట్‌ అవ్వడం ఆసక్తిరేకెత్తిస్తోంది. ఒకవేళ దీనిని మిగిలిన సినిమాల విషయంలో అపాదించి అందరూ, అన్ని సినిమాల విషయంలో ఇలా చేస్తే ఏంటి అనే చర్చ మొదలైంది. మరి టీమ్‌ ఈ విషయంలో ఏం ఆలోచించి ఇలా అనౌన్స్‌మెంట్ ఇవ్వకుండా ఆపింది అనేది తెలియాల్సి ఉంది. ఏదైతే ఏముంది సినిమా అనౌన్స్‌మెంట్‌ అయితే అయిపోయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus