Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తనపై.. క్లాస్ పీకిన కాజల్.. ఏమైందంటే?

కాజల్ (Kajal Aggarwal) నటించిన ‘సత్యభామ’ (Kajal’s Satyabhama) సినిమా మే 31న విడుదల కాబోతోంది. నవీన్ చంద్ర (Naveen Chandra) కాజల్ కి జోడీగా నటిస్తున్నాడు. అలాగే ప్రకాష్ రాజ్ (Prakash Raj) , నాగినీడు (Nagineedu) , రవివర్మ (Ravi Varman) , హర్షవర్ధన్ (Harsha Vardhan) వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాజల్ నటిస్తున్న ఈ సినిమాని సుమన్ చిక్కాల (Suman Chikkala) డైరెక్ట్ చేశారు. టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని రాబట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాజల్ చురుగ్గా పాల్గొంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాజల్..

‘సత్యభామ’ సినిమా కోసం చిన్న చితకా ఛానల్స్ కి కూడా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ క్రమంలో ఆమె తన 17 ఏళ్ళ సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. అదే టైంలో ఆమెకు ఎదురైన ఇబ్బందులు గురించి కూడా చెప్పుకొచ్చింది. కాజల్ మాట్లాడుతూ.. “కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న టైంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.

తొలిరోజు షూటింగ్ పూర్తయ్యాక వెళ్లి వ్యానిటీ వ్యాన్ లో కూర్చుని రిలాక్స్ అవుతున్నాను. ఆ టైంలో ఆ మూవీ అసిస్టెంట్ డైరెక్టర్.. వ్యాన్లోకి పర్మిషన్ లేకుండా వచ్చి .. ‘షర్ట్ విప్పేసి అతని ఛాతిపై ఉన్న ఒక టాటూని చూపించాడు.ఆ టాటూ నా పేరుతో ఉంది. ఆ టైంలో నాకు చాలా ఆనందం వేసింది అదే టైంలో అతను సడన్ గా అలా చేసే సరికి భయం వేసింది. దీంతో మందలించి పంపించేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus