‘కల్కి 2898AD : ‘బుజ్జి’ ఇంట్రో వీడియో వచ్చేసింది.. ఎలా ఉందంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘కల్కి 2898 ad ‘ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్లింప్స్ ఇది వరకే రిలీజ్ అయ్యి సినిమాపై బజ్ ఏర్పడేలా చేసింది. హాలీవుడ్ సినిమాలకి ధీటుగా విజువల్స్ ఉండటంతో.. ‘కల్కి’ నెక్స్ట్ బిగ్ థింగ్ అని అంతా నమ్మారు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్..లు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.

‘కల్కి’ లో చాలా సర్ప్రైజ్ లు ఉన్నట్టు ముందు నుండీ కథనాలు వినిపించాయి. అందులో ‘బుజ్జి’ అనే కార్ కూడా ఒకటి. టైం ట్రావెల్ కథాంశంతో రూపొందిన సినిమా కావడంతో ‘బుజ్జి’ అనే కార్ పాత్ర ఇందులో కీలకంగా ఉంటుందని తాజాగా ఓ ఇంట్రో వీడియో ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. రామోజీ ఫిలిం సిటీలో ‘బుజ్జి’ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసి ఈ వీడియోని రిలీజ్ చేశారు.

ఇందులో ప్రధానంగా ‘బుజ్జి’ సలహాలు ఇవ్వడం.. ‘భైరవ’ పాత్ర చేస్తున్న మన ‘బుజ్జిగాడు’ ప్రభాస్ సాహసాలు చేయడం వంటి వాటికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. విజువల్స్ అయితే టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. జూన్ 27న రిలీజ్ కాబోతున్న ‘కల్కి’ పై మరింత అంచనాలు పెంచే విధంగా ఈ వీడియో ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus