నా నువ్వే మూవీ థియేట్రికల్ ట్రైలర్ | క‌ల్యాణ్ రామ్ | త‌మ‌న్నా

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ` నా నువ్వే`. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ ప‌తాకంపై జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి నిర్మించిన చిత్రం `నా నువ్వే`. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ – “జ‌యేంద్ర‌గారు డైరెక్ట్ చేసిన `180` సినిమాను నేను చూశాను. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో నేను సినిమా చేయాల‌న‌గానే.. జ‌యేంద్ర‌గారేమో ప్యూర్ ల‌వ్ స్టోరీస్ చేస్తారు… మ‌న‌మేమో మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తాం. నాకు న‌మ్మ‌కం లేదండి అన్నాను. అయితే మ‌హేశ్ `లేదు సార్‌.. నిజం సార్‌.. అందులో పి.సి.శ్రీరామ్‌గారు కెమెరామెన్ అండి` అన్నారు. క‌లా? నిజ‌మా? అనుకున్నాను. ఘ‌ర్ష‌ణ‌, గీతాంజ‌లి వంటి సినిమాలు చూసి ఆయ‌నలాంటి కెమెరామెన్‌తో ఎప్పుడో వ‌ర్క్ చేస్తామో.. అంత పెద్ద కెమెరామెన్ మ‌న‌తో వ‌ర్క్ చేయ‌డం క‌ల‌గా మిగిలిపోతుంద‌నుకున్నాను. అయితే జ‌యేంద్ర‌గారి వ‌ల్ల క‌ల నిజ‌మైంది. ఈ సినిమా చేసే స‌మ‌యంలో ఇందులో నేను హీరోగా చేయ‌డం క‌రెక్టేనా? అని అడిగాను. ఇదొక మ్యూజిక‌ల్ ల‌వ్ స్టోరీ. దానికి త‌న సంగీతంతో శ‌ర‌త్‌గారు ప్రాణం పోశారు. త‌మ‌న్నా త‌ప్ప మ‌రో హీరోయిన్ ఉంటే ఈ సినిమాలో నేను న‌టించ‌లేక‌పోయేవాడిని. త‌మ‌న్నా.. నా వ‌ర్క్‌ను ఈజీ చేసేసింది. అలాగే నిర్మాత‌లు కిర‌ణ్‌, విజ‌య్‌లు ఎంతో స‌పోర్ట్ అందించారు. ఇదొక మంచి జ‌ర్నీ “ అన్నారు.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus