హైదరాబాద్ లో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ భారీ క్లైమాక్స్ షూటింగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. సోమవారం నుంచి (12-02) హైదరాబాద్ లో భారీ షూటింగ్ కు ప్లాన్ చేశారు. ఇందులో చిత్ర క్లైమాక్స్ షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట లవర్ ఆల్సో… ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికుల దినోత్సవ కానుకగా… ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్… ఇప్పుడు లవర్ ఆల్సో అంటూ ప్రేమను పంచబోతున్నారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్య మందించారు. విశాల్ శేఖర్ సంగీతమందించారు. శేఖర్ ఈ పాటను పాడారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ – శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా… వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ… గ్రాండియర్ గా “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. చిత్రాన్ని నిర్మిస్తున్నాం. రేపటి నుంచి హైదరాబాద్ లో క్లైమాక్స్ చిత్రీకరించబోతున్నాం. ఈ క్లైమాక్స్ ను భారీస్థాయిలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాం. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాటను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నాం. రామజోగయ్య శాస్త్రి తన అనుభవాన్ని రంగరించి ఈ అందమైన పాటను రచించారు. విశాల్ శేఖర్ అద్భుతమైన ట్యూన్ అందించారు. శేఖర్ గాత్రంతో ఈ పాట మరింత అందంగా తయారైంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus