అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని (Vijay Binni) దర్శకుడిగా మారుతూ చేసిన మూవీ ‘నా సామి రంగ’ (Naa Saami Ranga). అల్లరి నరేష్ (Allari Naresh) , రాజ్ తరుణ్ (Raj Tarun) వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో నటించడంతో ప్రేక్షకుల దృష్టి ఈ మూవీ పై పడింది. ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి (Srinivasaa Chitturi) ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ..ల కి సూపర్ రెస్పాన్స్ లభించాయి.
దీంతో అంచనాలు కూడా బాగా పెరిగాయి. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ లభించింది. దీంతో కలెక్షన్స్ బాగా వచ్చాయి. ఒకసారి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 4.98 cr |
సీడెడ్ | 3.76 cr |
ఉత్తరాంధ్ర | 3.62 cr |
ఈస్ట్ | 2.77 cr |
వెస్ట్ | 1.40 cr |
గుంటూరు | 1.52 cr |
కృష్ణా | 1.30 cr |
నెల్లూరు | 0.88 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 20.23 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.79 cr |
ఓవర్సీస్ | 0.65 cr |
వరల్డ్ వైడ్( టోటల్) | 21.67 cr (షేర్) |
‘నా సామి రంగ’ సినిమాకు రూ.19.1 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.19.4 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.21.67 కోట్ల షేర్ ను రాబట్టింది.మొత్తంగా రూ.2.27 కోట్ల లాభాలను అందించి క్లీన్ హిట్ గా నిలిచింది.