చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న భూతం పైరసీ. గత కొద్ది నెలల నుంచి ఈ భూతం మరీ రెచ్చిపోతోంది. చిత్రం విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్ లో చిత్రం దర్శనమిస్తుండటం చిత్ర ప్రముఖులను విస్మయానికి గురి చేస్తోంది. ఇటీవలే విడుదలైన 24 , మనితన్ చిత్రాలు ఈ పైరసీ బారిన పడటంతో నడిగర్ సంఘం ప్రముఖులు దీనిపై పూర్తిగా దృష్టి సారించారు.
చెన్నైలో జరుగుతున్న పైరసీ వ్యాపారం పై నడిగర్ సంఘం సైబర్ సెల్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేయడంతో పాటు దీని వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు ధియేటర్ యాజమాన్యాలు, ముఖ్యంగా మల్టీప్లెక్స్ యాజమాన్యాలు పైరసీ కాకుండా జాగ్రత్త వహించాలని నడిగర్ సంఘం ప్రతినిధులు కోరుతున్నారు.