శైలజా రెడ్డి అల్లుడు ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులుగా నాగ్, నాని

మారుతీ దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య చేసిన శైలజా రెడ్డి అల్లుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకున్నాయి. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ సంగీతాన్ని అందించారు. ఆ పాటలు కూడా యువతకి చేరువయ్యాయి. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఈనెల 13 న థియేటర్లోకి రానుంది.

అందుకే ఈనెల 9 న ప్రీ రిలీజ్ వేడుకని వైభవంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ వేడుకకి చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ ని ఆహ్వానించాలని మొదట అనుకున్నారు. కానీ హరికృష్ణ మరణంతో బాధలో ఉన్న తారక్ ని పిలవడానికి వెనకడుగువేశారు. తాజాగా ఈ వేడుకకి దేవ్ దాస్ లు నాగ్, నాని లు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్టు తెలిసింది. కొడుకు సినిమా కాబట్టి నాగ్ రావడంలో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ నాని రావడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. నాని సినిమా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయిన భలే భలే మగాడివోయ్ సినిమా దర్శకుడు మారుతి పిలవడంతో నాని కాదనలేకపోయారని సమాచారం. సో ఈ వేదికపై దేవ్ దాస్ చేసే హంగామా శైలజా రెడ్డి అల్లుడు సినిమాకి తప్పకుండా ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus