Kalki: అంతమందిని అందుకే తీసుకున్నాం.. ‘కల్కి’ గురించి నాగీ స్పెషల్‌ ముచ్చట్లు!

  • August 25, 2024 / 09:30 AM IST

‘కల్కి 2898 ఏడీ’  (Kalki 2898 AD) . సినిమా విడుదలైనప్పటి నుండి మొన్నీమధ్య వరకు ఆ సినిమా గురించి సోషల్‌ మీడియా, మీడియాలో, బయట చర్చ జరుగుతూనే ఉంది. సినిమా గురించి ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ మొదలయ్యేసరికి మరోసారి సినిమా గురించి చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఆ సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో సినిమా విశేషాలను షేర్‌ చేసుకున్నారు.

Kalki

‘కల్కి 2898 ఏడీ’ సినిమాను కాశీ నేపథ్యంలో ఎందుకు తీశారు అని అడిగితే.. మా పెద్దవాళ్లు కాశీ గొప్పతనాన్ని వివరించేవారని, అప్పటినుండే తనకూ కాశీ గురించి ఆసక్తి మొదలైందని నాగ్‌ అశ్విన్‌ చెప్పారు. ప్రభాస్‌  (Prabhas)  – అమితాబ్‌ బచ్చన్‌తో(Amitabh Bachchan) , కలసి వర్క్‌ చేయడం ఎలా ఉంది అని అడగ్గా. ప్రభాస్‌కు అమితాబ్‌ అంటే ఎంతో గౌరవం, అభిమానం. వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు అభిమానంతో ఉండేవారు అని నాగీ చెప్పుకొచ్చారు.

షూటింగ్‌ ఎలా సాగింది అంటే.. ప్రభాస్‌, అమితాబ్‌ ఇద్దరూ చాలా ఎత్తుగా ఉండడంతో సన్నివేశాలు చిత్రీకరణకు కష్టపడ్డామని చెప్పారు. సుమతి పాత్రకు దీపిక పడుకొణె (Deepika Padukone)  మరింత అందాన్నిచ్చిందని, ఆమె మంటల మధ్య నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్‌ అంటే తనకు ఇష్టమని తెలిపారు. యాస్కిన్‌ పాత్రను ఎలా చూపించాలా అని కంగారుపడ్డామని, అయితే కమల్‌ హాసన్  (Kamal Haasan) సెట్‌లోకి వచ్చాక మొత్తం పరిస్థితి మారిపోయిందని నాగీ తెలిపారు.

కమల్‌ హాసన్‌ సలహాలు, సూచనలు తమను ముందుకు నడిపించాయని చెప్పిన నాగీ.. మేము ఈ సినిమా కోసం ప్రతి విషయాన్ని స్క్రాచ్‌ నుండి తయారుచేశామని చెప్పారు. సినిమా చిత్రీకరణలో సగం టైమ్‌ ఇంజినీరింగ్‌ వర్క్‌కే అయిందని చెప్పారు. ఈ క్రమంలో బుజ్జి కోసం 18 వాహనాలు డిజైన్‌ చేశామని, ఆఖరిగా బుజ్జి వెహికల్‌ను ఓకే చేశామని చెప్పారు. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతోనే విజయ్‌ దేవరకొండ  (Vijay Devarakonda) , రామ్‌ గోపాల్‌ వర్మ  (Ram Gopal Varma) , రాజమౌళి (Rajamouli).. ఇలా చాలామంది సినిమాలోకి తీసుకున్నాం అని చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus