ప్రభుత్వానికి నాగ్ అశ్విన్ రిక్వెస్ట్ సరైనదేనా..!

లాక్ డౌన్ వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పటి వరకూ షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదు.ఎలా చూసుకున్నా… మన టాలీవుడ్ కు 800 కోట్ల వరకూ నష్టాలు వాటిల్లినట్టు సమాచారం. ఈ క్రమంలో థియేటర్స్ తెరిచేలా ప్రభుత్వానికి కొందరు అగ్ర నిర్మాతలు రిక్వెస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. సింగిల్ స్క్రీన్స్ లో కేవలం 3 షోలు ప్రదర్శిస్తూ … 50 శాతం టికెట్ లు మాత్రమే అమ్మేలా.. అలాగే సీటుకి సీటుకి గ్యాప్ ఉండేలా చూసుకుని థియేటర్స్ ఓపెన్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు రిక్వెస్ట్ పెట్టారు.

అంటే కాదు.. ఒక షోకి మరో షోకి మధ్య 15నిమిషాల గ్యాప్ ను 45 నిముషాలు చేస్తామని.. ఆ గ్యాప్ లో శానిటైజర్స్ తో క్లీన్ చేస్తామని కూడా పేర్కొన్నారని తెలుస్తుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న జనాలు థియేటర్స్ కు వస్తారు అన్న నమ్మకం లేదు. ఈ టైంలో థియేటర్స్ లో మద్యం ఏర్పాటు చేస్తే.. జనాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఈ విషయం పై నిర్మాతలందరు కలిసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని కూడా ఆయన చెప్పుకొచ్చాడు.

ఇదే విషయాన్ని రానాతో పాటు నిర్మాత సురేష్ బాబును కూడా కలిసి డిస్కస్ చేసినట్టు కూడా చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. అయితే థియేటర్ లకు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు.. కాబట్టి మద్యం అనుమతులకు ప్రభుత్వం పెర్మిషన్ ఇస్తుందా… అని కొందరి డౌట్ అయితే.. మరికొందరు సీట్ కి సీట్ కి గ్యాప్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్ రారు అనే ఉద్దేశంతో నాగ్ అశ్విన్ ఇలా కామెంట్స్ చేసాడని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే.. నాగ్ అశ్విన్ త్వరలో ప్రభాస్ తో ఓ చిత్రం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus