బాలయ్యను పొగిడిన నాగబాబు..కారణం ఏమిటంటే..?

టాలీవుడ్ లో బాలకృష్ణ-నాగబాబు ఉప్పు నిప్పు టైప్. వీరిద్దరికి క్షణం పడదు. అనుక్షణం కొట్టుకోకపోయినా, నాగబాబు వ్యాఖ్యలకు బాలయ్య స్పందించకపోయినా వీరి మధ్య వైరం మాత్రం ఉంది. కొంత కాలం క్రితం బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు వరుస ఎపిసోడ్స్ చేశారు. బాలయ్య మాటలను తప్పుబట్టడమే కాకుండా తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా బాలయ్య చిరంజీవి అధ్యక్షతన టాలీవుడ్ గురించి జరిగిన మీటింగ్ పై విమర్శలు చేశారు.

కీలకమైన మీటింగ్ కి తనను పిలవక పోవడంతో.. భూములు పంచుకుంటున్నారా అన్నారు. ఈ వ్యాఖ్యలకు నాగబాబు బాలయ్యపై విరుచుపడ్డారు. ఇండస్ట్రీలో నువ్వు ఒక హీరోవి మాత్రమే, కింగ్ కాదు అన్నారు. అలాగే బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బాలయ్య అంటే ఈ స్థాయిలో విరుచుకుపడే నాగబాబు ఓ సంధర్భం కోసం పొగడాల్సి వచ్చింది. సుశాంత్ మరnam తరువాత బాలీవుడ్ లో నెపోటిజంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.

ఇక టాలీవుడ్ లో కూడా నెపోజం ఉంది. వారసత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడిన నాగబాబు ఎన్టీఆర్ కొడుకు కావడం వలన బాలకృష్ణ స్టార్ కాలేదని, అతనిలో ప్రత్యేకత ఉండడం వలనే జనాలు ఆదరించారు అన్నారు. పోలిక కోసం బాలయ్య పేరు చెప్పినా, నాగబాబు అనుకూల వ్యాఖ్యలు చేయడం ప్రత్యేకత సంతరించుకుంది.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus