సినిమాల్లో నాగచైతన్య కెరీర్ అంత ఈజీగా ఏమంత ఈజీగా స్టార్ట్ అవ్వలేదు. ఎన్నో అంచనాలతో ప్రారంభమైన తొలి సినిమా విడుదల దగ్గరకు వచ్చేసరికి ఇబ్బందిపడింది. కంటెంట్ బాగున్నా సరైన విజయం అందుకోలేకపోయింది. అయితే ఓటీటీ ఎంట్రీ మాత్రం ఘనంగా ప్రారంభమైంది. ‘దూత’ వెబ్‌సిరీస్‌తో ఇటీవల వచ్చిన ఆయన మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా ‘దూత’ వెబ్ సిరీస్‌ను దర్శకుడు విక్రమ్ కె. కుమార్ రూపొందించారు.
అమెజాన్ ప్రైమ్ వేదికగా డిసెంబర్ 1 నుండి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రే షేడ్స్ ఉన్న సాగర్ అనే జర్నలిస్టు పాత్రలో చక్కగా నటించాడు నాగ చైతన్య. ఈ నేపథ్యంలో సిరీస్ గురించి, తన కెరీర్ గురించి నాగచైనత్య మాట్లడాడు. ప్రమోషన్ లో పాల్గొన్న నాగ చైతన్య తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
తాను సినిమాల్లోకి వస్తానని తన తాత అక్కినేని నాగేశ్వరరావు ఎప్పుడో చెప్పారని నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అంచనానే ఇప్పుడు నిజమైందని చెప్పుకొచ్చారు. నువ్వు పెద్దయ్యాక ఏం అవుతావని ఓసారి అక్కినేని అడిగారట… దాని చైతన్య ఇంజినీర్ అవుతాను, ఆటోమొబైల్ ఇంజినీర్, కంప్యూటర్ ఇంజినీర్ అని చెప్పారట. అయితే అక్కినేని మాత్రం వాడు తప్పకుండా సినిమాల్లోకి వస్తాడు అని నాగార్జునతో చెప్పారట. అప్పట్లో కచ్చితంగా అదే మాట తరచుగా చెప్పేవారట.
ఆఖరికి ఆయన అన్నట్లు తాను సినిమాల్లోకి వచ్చాను అని చెప్పాడు (Naga Chaitanya) చైతు. ప్రస్తుతం చైతన్య ‘తండేల్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. గీతా ఆర్ట్స్ ఆ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇటీవల ముహూర్తం కార్యక్రమం కూడా జరిగింది.