ప్రతి ఒక్కరికీ తొలి గురువు అమ్మే. ఆమె చెప్పే జీవితపు పాఠాలు ఎంతో విలువైనవి. చిరు ప్రాయంలో మాతృమూర్తి చెప్పే ప్రతి మాట మనకు భవిష్యత్తులో పూల బాట అవుతుంది. అలా తల్లి మాటను గౌరవించి యువసామ్రాట్ నాగచైతన్య ముందుకు సాగుతున్నారు. చైతూ తల్లి ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు కుమార్తె లక్ష్మి. అక్కినేని నాగేశ్వరరావు చిన్న కోడలు. ఆమె పుట్టినిల్లు మెట్టినిల్లు.. రెండూ సినీ రంగానికి చెందినవే. సినీ పరిశ్రమలోని లాభనష్టాలను ఆమె దగ్గరుండి చూసారు. అందుకే కొడుకు నాగ చైతన్యని సినిమాలకు దూరంగా పెంచింది. తండ్రి నాగార్జున షూటింగ్ ని దగ్గరుండి చూసి చైతూకి సినిమాల వైపు మనసుమల్లినప్పుడు లక్ష్మి కొడుకుని పరీక్షించింది.
డిగ్రీ పూర్తి అయ్యేవరకు సినిమాల వైపు అడుగుపెట్టకూడదని షరతు విధించింది. దీనిగురించి చైతూ మాట్లాడుతూ.. “నటన కోసం శిక్షణ తీసుకుంటాను అని అమ్మకి చెప్పినప్పుడు ఆమె చదువుకు ప్రాధాన్యం ఇస్తూనే ఏమైనా చేయమని చెప్పింది. అలాగే నేను బీ కామ్ చదువుతూ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాతే జోష్ సినిమా చేసాను. ఇప్పుడొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. అమ్మ డిగ్రీ చేయమని పట్టు పట్టడం వెనుక ఎంత ముందు చూపుందో ఇప్పుడు అర్ధమవుతుంది. నాకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలన్నీ నేనే స్వయంగా చూసుకోగలుగుతున్నా” అని వివరించారు.