Naga Chaitanya: శోభితతో రిలేషన్‌షిప్‌ నాగచైతన్య రియాక్షన్‌.. ఏం చెప్పకుండా ఏదో చెప్పినట్లు..!

చైసామ్‌ కాస్త.. చైతన్య, సమంతగా మారిపోయిన తర్వాత నాగచైతన్య పెద్దగా స్పందించడం లేదు. తన పాటికి తాను సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. మరోవైపు సమంత మాత్రం ఆ విషయం గురించి ఎక్కడెక్కడో ప్రస్తావిస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో చైతన్య మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అంటూ వార్తలొచ్చాయి. వాటికి సాక్ష్యంగా ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ విషయం ఇటీవల అఖిల్‌ దగ్గర ప్రస్తావిస్తే మాట దాటేశాడు. ఇప్పుడు చైతన్య కూడా దాదాపు ఇదే పని చేశాడు. అయితే ఇది కాస్త డిఫరెంట్‌ అని చెప్పాలి.

చై ప్రస్తుతం ‘కస్టడీ’ సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మే 12 విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న చైతన్య.. తన పర్సనల్‌ లైఫ్‌ గురించి ప్రస్తావించాడు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. జీవితంలో తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవన్న చైతన్య.. ప్రతిదీ ఒక పాఠంగా మాత్రం భావిస్తానని చెప్పాడు. దీనిపై ఇంకాస్త క్లారిటీగా చెబుతారా అని అడిగితే..

తాను చేసిన రెండు మూడు సినిమాల విషయంలో తెలివైన నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. అయితే చైతన్య నిజంగానే సినిమాల గురించే ఈ మాట అన్నాడా? లేక వేరే దేని గురించైనా స్పందించాడా అని అనుకుంటున్నారు. ఇక శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి సంగతి ఏంటి అని అడిగితే.. “దాని గురించి నాకేం తెలియదు” అని వెల్లడించారు.

‘ఏజెంట్’ సినిమా గురించి మాత్రమే మాట్లాడతానని చెప్పాడు. దీంతో ఈ విషయంలో (Naga Chaitanya) చైతన్య క్లారిటీ ఇచ్చినట్లే ఇచ్చి ఇవ్వలేదు అన్నట్లుగా మారింది. ఇటీవల లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో నాగచైతన్య చెఫ్‌తో పోజులిస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో శోభిత కూర్చుని ఉన్న పిక్ నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో వీళ్ల రిలేషన్‌షిప్‌పై అనుమానాలు బలపడ్డాయి. ఇప్పుడు వాటిపై చైతన్య ఇలా సమాధానమిచ్చాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus