కొన్ని సినిమాలు చేయడానికి నటులు, దర్శకులు వర్క్‌షాపులు నిర్వహిస్తుంటారు, ఫీల్డ్ విజిట్‌లకు వెళ్తుంటారు. అంటే జనాల మధ్యలోకి వెళ్లి, వాళ్లను చూసి అందుకు తగ్గట్టుగా ఆ పాత్రలకు జీవం పోసే ప్రయత్నం చేస్తుంటారన్నమాట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలా వర్క్‌షాపులు చేసి పట్టాలెక్కబోతున్న సినిమా ‘తండేలు’. నాగచైతన్య – చందు మొండేటి కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా నుండి ఓ లుక్, టైటిల్ రిలీజ్ చేశారు. ఇందులో సముద్రంలో బోటు నడిపే జాలర్లకు నాగచైతన్య నాయకుడిగా కనిపిస్తాడు.
అయితే, ఈ సినిమా కోసం చైతన్య (Naga Chaitanya) ఎలా మారాడు, ఏం మారాడు అనే విషయాలను ఇటీవల ఆయనే చెప్పుకొచ్చాడు. నా కెరీర్‌లోనే అధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రమిదని చెప్పి చైతన్య… కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రం అవుతుందని చెప్పాడు. ఆరేడు నెలలుగా ఈ సినిమా బృందంతో కలిసి పని చేస్తున్నానని, శ్రీకాకుళం జిల్లాలోని కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారుల్ని కలిశానని చెప్పాడు. యాస, హావభావాల గురించి బాగా తెలుసుకుని సినిమాకు సిద్ధమయ్యా అని చెప్పాడు.
మత్స్యకారుడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కబోయే సినిమా అని, కథకి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిని కలిశానని కూడా చెప్పాడు చైతన్య. డిసెంబరు తొలి వారం నుండి షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పాడు. మరి ‘దూత’ వెబ్ సిరీస్ చేశారు కదా… ఏం డిఫరెన్స్ గమనించారు అని అడిగితే… నటుడిగా సినిమా, వెబ్ సిరీస్‌కు పెద్దగా వ్యత్యాసం కనిపించలేదు అని చెప్పాడు. అయితే కథని వీలైనంత సవివరంగా చెప్పే అవకాశం వెబ్ సిరీస్‌తో దొరుకుతుంది అని అన్నాడు.
అలాగే ‘దూత’ వెబ్ సిరీస్‌ని 2, 3 సీజన్లుగా తీసేందుకు సరిపడా ఆలోచనలు విక్రమ్ దగ్గర ఉన్నాయి అని కూడా చెప్పాడు. అయితే తొలి సిరీస్ బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. మరి సీజన్లు అంటే ఏమో మరి. తొలి సీజన్ అయితే డిసెంబరు 1 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!