యంగ్ హీరో నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోపక్క చైతు ‘థాంక్యూ’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. దీంతో పాటు హిందీ సినిమాలో ‘లాల్ సింగ్ చద్దా’లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీనికోసం ఇటీవల లడఖ్ కు వెళ్లాడు. అయితే ఇప్పుడు చైతు కోసం మరో కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
‘పెళ్లిచూపులు’ సినిమాతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్.. ఆ తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా తీశాడు. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయడానికి తరుణ్ భాస్కర్ చాలా సమయం తీసుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో వెంకీతో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. గతంలో వెంకీకి కథ కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియడం లేదు.
అందుకే చైతూతో సినిమా చేయాలనుకుంటున్నాడు తరుణ్ భాస్కర్. ఈ మేరకు కథ సిద్ధం చేసుకొని సురేష్ బాబుకి వినిపించాడు. ఆయనకు నచ్చడంతో ఇప్పుడు చైతుకి వినిపించడానికి రెడీ అవుతున్నాడు. చైతుకి కూడా కథ నచ్చితే ఈ కాంబో సెట్ అవ్వడం ఖాయం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు!
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్