సినిమా విడుదలయ్యాక కాస్త అటుఇటుగా ఉన్నా విజయయాత్ర అంటూ జనాల మధ్యలో హీరోలు, సినిమా టీమ్ వెళ్తుంటారు. లేదంటే సినిమా షూటింగ్ సమయంలో అవుట్ డోర్ షూటింగ్ సందర్భంలో వెళ్తుంటారు. అంతేకానీ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు, ఇంకా చెప్పాలంటే ముహూర్తపు షాట్ కొట్టకుండానే ఓ హీరో జనాల మధ్యలోకి వెళ్లడం టాలీవుడ్‌లో అరుదే. అందులోనూ స్టార్ హీరోల విషయంలో ఇంకాను. అయితే ఇప్పుడు ఈ పని చేశాడు నాగచైతన్య. తన కొత్త సినిమా కోసం శ్రీకాకుళం వెళ్లి మరీ అక్కడి పరిస్థితులు తెలుసుకున్నాడు.
ఇప్పుడు, దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. బతుకు తెరువు కోసం గుజరాత్‌లోని వీరవల్‌కు వెళ్లి సముద్రంలో చేపలవేట చేస్తూ.. అనుకోని పరిస్థితుల్లో పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కిన మత్స్యకారుల ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించనున్నారు. నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగానే ఇప్పుడు సినిమా టీమ్ శ్రీకాకుళం జిల్లాకు వెళ్లింది. అక్కడి ఎచ్చెర్ల మండలం డి మత్స్యలేశం పంచాయతీ కొత్త మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించారు.
శ్రీకాకుళం – వీరవల్ మత్స్యకారుల నేపథ్యంలో ఓ కథను చందు మొండేటి చెప్పారు. వెంటనే సినిమా చేసేద్దాం అనిపించింది. ఈ క్రమంలో మత్స్యకారుల జీవన స్థితిగతులు, వారి ఆచార వ్యవహారాలు, జీవన విధానం గురించి తెలుసుకుంటే సినిమాకు పనికొస్తుంది అనిపించింది. అలాగే గంగపుత్రుల ఇబ్బందులు, వ్యవహార శైలి, యాస, భాషను స్వయంగా చూస్తే ఇంకా బాగా సినిమా చేయొచ్చు అనిపించింది. అందుకే ఇక్కడకు వచ్చాను అని చైతన్య చెప్పుకొచ్చాడు.
ఐదేళ్ల క్రితం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 24 మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వీరవల్ వద్ద సముద్రంలో చేపల వేట సాగిస్తూ పొరపాటున పాకిస్థాన్ కోస్టు గార్డులకు చిక్కారు. దాంతో వీరిని బందీలుగా చేసి పాకిస్థాన్‌లో ఏడాదిన్నర పాటు జైలులో ఉంచారు. ఈ కథలో ఓ ప్రేమకథను యాడ్ చేసి ఇప్పుడు సినిమాగా చూపించనున్నారు. చైతు (Naga Chaitanya) కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా ఇది ఉండనుంది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?