రెండు సినిమాలు రెడీ అయినట్టే!

రెండు సినిమాలు ఒకేసారి విడుదల కావడం ఏ నటుడికైనా సంతోషం కలిగించే విషయమే. థియేటర్ల లభ్యత వంటి విషయాలు తగిన విధంగా ప్లాన్ చేసుకుంటే సరే గాని లేకపోతే కష్టాలు తప్పవు. అయితే వాటిలో ఓ సినిమా కేవలం జాప్యం వల్ల మరో సినిమాతో జత కలవడం ఇబ్బందికరమే. నేటితరం హీరోల్లో నాని ఈ అనుభవాన్ని చవిచూశాడు. నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘జెండాపై కపిరాజు’ సినిమాలు గతేడాది ఒకేరోజున విడుదలయ్యాయి. ఈ సంవత్సరం నాగ చైతన్య ఇదీ ఫీట్ చేస్తాడని ప్రచారం సాగినా ఇప్పుడు కాస్త ఊరట లభించింది.

‘దోచెయ్’ తర్వాత గౌతమ్ మీనన్ తో చేసిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ద్విభాష చిత్రమైన ఈ సినిమాని చైతూ అనుకున్న టైంలో పూర్తి చేసిన తమిళ హీరో శింబు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల పెద్ద మనసు చేసుకున్న శింబు గౌతమ్ సినిమాని పూర్తి చేశేశాడు. దీంతో విడుదలకు సిద్ధమయిన ఈ సినిమా చైతూ ‘ప్రేమమ్’తో పాటు ఒకే రోజున తెరమీదికొస్తుందని ప్రచారం జరిగింది. అయితే దసరా సీజన్, ఇతర సినిమాలు దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ మూడోవారంలో విడుదల చేయడానికి నిర్ణయించారట. చైతూ ఈ రెండు సినిమాలతో రెండు హిట్స్ కొడతాడా లేక నానిలా ఒకదానితోనే సరిపెట్టుకుంటాడా అన్నది తేలాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus