Naga Chaitanya: జిమ్ లో భారీగా వర్కౌట్స్ చేస్తున్న చైతన్య..ఫోటో వైరల్!

అక్కినేని నాగచైతన్య త్వరలోనే గీత ఆర్ట్స్ బ్యానర్ లో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో సరికొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన గత కొంతకాలంగా ఎలాంటి హిట్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ద్వారా కూడా నిరాశ ఎదుర్కొన్నారు. నాగచైతన్య తన తదుపరి సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ లో ప్రకటించారు.

చందు మొండేటి ఒక నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఒక మత్స్యకారుడి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఇప్పటికే నాగచైతన్య కొందరి జాలర్లను కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తూ వారి గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు.

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుందని ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం నాగచైతన్య కూడా భారీగా కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం ఈయన పెద్ద ఎత్తున జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారడంతో బహుశా ఈ సినిమాలో నాగచైతన్య సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారేమో అందుకే ఇలా వర్కౌట్ చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కార్తికేయ2 వంటి సూపర్ హిట్ సినిమా ద్వారా పనితీయ స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చందు మొండేటి తన తదుపరి సినిమాని నాగచైతన్యతో గీత ఆర్ట్స్ బ్యానర్ లో చేయడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో మరోసారి సాయి పల్లవి నాగచైతన్యకు (Naga Chaitanya) జోడిగా నటించబోతున్నటువంటి నేపథ్యంలో సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus