చైతూ చేతుల మీదుగా బ్రాండ్ బాబు ట్రైల‌ర్ విడుద‌ల‌

హీరో అక్కినేని నాగ‌చైత‌న్య బ్రాండ్ బాబు ట్రైల‌ర్ విడుద‌ల చేసారు. సుమంత్ శైలేంద్ర ఈ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. తెలుగ‌మ్మాయి ఇషా రెబ్బా ఇందులో హీరోయిన్. పార్కీ ప్ర‌భాక‌ర్ బ్రాండ్ బాబును తెర‌కెక్కిస్తున్నారు. మారుతి ఈ చిత్రానికి క‌థ అందించ‌డం విశేషం. ఆయ‌నే స‌మ‌ర్ప‌కుడిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ట్రైల‌ర్ విడుద‌ల చేసిన త‌ర్వాత నాగ‌చైత‌న్య సినిమా గురించి మాట్లాడుతూ.. సుమంత్ శైలేంద్ర‌ను తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఆహ్వానించారు. ట్రైల‌ర్ చాలా బాగుంద‌ని ఆక‌ట్టుకుంద‌ని.. మారుతి కామెడీ టైమింగ్ చాలా చోట్ల క‌నిపించింద‌ని చెప్పారు. ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ కూడా క‌నిపించింద‌ని చెప్పారు నాగ‌చైత‌న్య‌. సుమంత్, ఇషారెబ్బాకు ఈ చిత్రం విజ‌యం తీసుకురావాల‌ని కోరుకున్నాడు నాగ‌చైత‌న్య‌.

ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. నాగ‌చైత‌న్య మా చిత్ర ట్రైల‌ర్ ను లాంఛ్ చేయ‌డం.. ఆయ‌న నచ్చింద‌ని చెప్ప‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. ఆగ‌స్ట్ 3న బ్రాండ్ బాబు విడుద‌ల కానుంద‌ని.. క‌చ్చితంగా ప్రేక్ష‌కులకు కూడా ఈ చిత్రం న‌చ్చుతుంద‌ని చెబుతున్నాడు ప్రభాక‌ర్.

హీరోయిన్ ఇషారెబ్బా మాట్లాడుతూ.. నాగ‌చైత‌న్య ట్రైల‌ర్ విడుద‌ల చేసినందుకు థ్యాంక్స్ చెప్పింది. ప్రేక్ష‌కుల‌ను త‌మ సినిమా క‌చ్చితంగా అల‌రిస్తుంద‌ని చెప్పింది ఇషా.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus