కాలేజీ నేపథ్యంలో నాగచైతన్య, మారుతి మూవీ

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తొలి చిత్రం జోష్ పూర్తిగా కాలేజీ నేపథ్యంలో సాగింది. ఈమూవీ మంచి విజయాన్ని అందుకోలేక పోయింది. ఆ తర్వాత 100 లవ్, ప్రేమమ్ సినిమాల్లో ఎక్కువగా కాలేజీ సీన్లు ఉంటాయి. ఇవి విజయాన్ని సాధించాయి. మళ్లీ చైతూ పూర్తి స్థాయి కాలేజీ నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం తనకి ప్రేమమ్ వంటి హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి సినిమా చేస్తున్నారు. టైటిల్ లోగో రిలీజ్ తోనే ఆసక్తి కలిగించిన ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మాధవన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

దీని తర్వాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో “శైల‌జా రెడ్డి అల్లుడు”అనే చిత్రాన్ని చేస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ హీరొయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నిన్నటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. గోపి సుందర్ సంగీతమందిస్తున్న ఈ సినిమా దాదాపు మొత్తం కాలేజీలోనే సాగుతుందని సమాచారం. చైతూ, అను ఇద్దరూ ఈ మూవీ లో కాలేజీ స్టూడెంట్స్ గా నటించబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలేజీ స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అవుతారని చిత్ర బృందం భావిస్తోంది. మహానుభావుడు వంటి హిట్ తర్వాత మారుతీ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus