సమ్మోహనం కథ మొదట చైతూ వద్దకే వచ్చిందంట..!

కథలు హిట్ అవుతాయా ? ఫ్లాప్ అవుతాయా ? అనేది కరక్ట్ గా చెప్పలేము. ఎంత అనుభవం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు స్టార్ హీరోలు సైతం తప్పటడుగులు వేస్తుంటారు. హిట్ కథలను వదిలేస్తుంటారు. ఆ కథలు వేరొకరు చేసి హిట్ కొడితే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. మంచి కథని ఎందుకు వదిలేశామా? అని పశ్చత్తాపడుతుంటారు. అటువంటి ఫీలింగ్ లోనే ఇప్పుడు నాగ చైతన్య ఉన్నారు. ఎందుకో వివరాల్లోకి వెళితే .. గ్రహణం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తర్వాత, జెంటిల్ మ్యాన్, అమీ తుమీ చిత్రాల డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం రీసెంట్ గా రిలీజ్ అయి సూపర్ సక్సస్ అందుకుంది. సుధీర్ బాబు, అదితీ రావు హైదరీ జంటగా నటించిన ఈ మూవీ విశేషంగా ఆకట్టుకుంటోంది. రోజురోజుకి కలక్షన్స్ పెంచుకుంటోంది.

అయితే ఈ కథని మోహన కృష్ణ మొదట నాగ చైతన్యకి వినిపించారంట. ఈ కథ నచినప్పటికీ చైతూ.. చేద్దామా? వద్దా? అనే విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడంతో సుధీర్ బాబు వద్దకు పోయింది. ప్రేమ కథా చిత్రమ్ తర్వాత విజయం కోసం తపిస్తున్న ఈ హీరోకి ఈ మూవీ గొప్ప విజయాన్ని అందించింది. ఈ మూవీ రిజల్ట్ తర్వాత నాగచైతన్య ఈసారి ఎలాగైనా మోహన కృష్ణ దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం సవ్యసాచి, శైలజా రెడ్డి సినిమాలతో బిజీగా ఉన్న చైతూ ఆ తర్వాత సమ్మోహనం డైరక్టర్ తోనే సినిమా చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus