Naga Chaitanya: వామ్మో.. నాగచైతన్య కొత్తింటి ధర అన్ని రూ.కోట్లా?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం కస్టడీ సినిమాతో సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సరైన బ్లాక్ బస్టర్ లేని నాగచైతన్య కస్టడీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో పాటు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని కామెంట్లు వ్యకమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు నాగచైతన్య తాజాగా కొత్తింట్లో గృహ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే.

ఈ కొత్తింటి ఖరీదు తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది. ఈ ఇంటి ఖరీదు ఏకంగా 15 కోట్ల రూపాయలు అని సమాచారం. నాగచైతన్య తన సినిమాల పారితోషికాలను ఈ సినిమా కోసం ఖర్చు చేశారని తెలుస్తోంది. నాగచైతన్య ఒంటరిగా జీవనం సాగించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది. రెండో పెళ్లి చేసుకోవలనే ఆలోచన చైతన్యకు లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. చైతన్య కెరీర్ పైనే దృష్టి పెట్టారని తెలుస్తోంది.

నాగచైతన్యకు కార్లు అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే. నాగచైతన్య దగ్గర ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. నాగచైతన్య ఇతర ఇండస్ట్రీలలో కూడా సత్తా చాటాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. నాగచైతన్య దగ్గర ఖరీదైన బైకులు సైతం ఉన్నాయి. నాగచైతన్య పారితోషికం ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లకు చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

నాగచైతన్య నాగార్జునతో మరిన్ని సినిమాలలో కలిసి నటిస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు. నాగచైతన్య క్లాస్ సినిమాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగచైతన్య వివాదాలకు దూరంగా కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం. నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus