Naga Chaitanya: ఆ సినిమా అంటే నాగచైతన్యకు అంత చిరాకా?

అక్కినేని వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో నటుడు నాగచైతన్య ఒకరు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అయితే హీరోలు అన్న తర్వాత వారికి హిట్ ఫ్లాప్ సినిమాలు రావటం సర్వసాధారణం . ఈ క్రమంలోనే నటుడు నాగచైతన్య సినీ కెరియర్ లో కూడా కొన్ని హిట్ సినిమాలు మరికొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అయితే నాగచైతన్య సినీ కెరియర్లో తనకు నచ్చిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయని ఈయన ఒక సందర్భంలో వెల్లడించారు.

నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా వివేక్ కృష్ణ దర్శకత్వంలో నటించిన చిత్రం బెజవాడ. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా అమలాపాల్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఇలా నాగచైతన్య కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచినటువంటి ఈ సినిమా అంటే నాగచైతన్యకు ఏ మాత్రం ఇష్టం ఉండదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ఇలా తన కెరీర్ లో నచ్చని సినిమా గురించి చెప్పినటువంటి నాగచైతన్య తనకు ఎంతో ఇష్టమైనటువంటి సినిమాల గురించి కూడా తెలియజేశారు.a తన సినీ కెరియర్ లో నటించిన ఏ మాయ చేసావే, మజిలీ, 100% లవ్, లవ్ స్టోరీ సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా చైతన్య వెల్లడించారు. ఇక నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా తర్వాత పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

ఇక నాగచైతన్య చివరిగా కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుత సినిమాల విషయానికొస్తే ఈయన గీత ఆర్ట్స్ బ్యానర్ లో చందు మొండేటి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించిన ప్రస్తుతం ఈ సినిమా సాయి పల్లవి మరో సారి జత కట్టబోతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus