2022 సంవత్సరం నాగచైతన్య కెరీర్ పరంగా షాకింగ్ ఇయర్ అనే చెప్పాలి. గతేడాది విడుదలైన నాగచైతన్య సినిమాలు లాల్ సింగ్ ఛడ్డా, థాంక్యూ కొన్ని రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదలై షాకింగ్ ఫలితాలను సొంతం చేసుకున్నాయి. లాల్ సింగ్ ఛడ్డా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య సత్తా చాటుతాడని భావించిన అభిమానులకు భారీ షాక్ తగిలిందనే సంగతి తెలిసిందే. అయితే లాల్ సింగ్ ఛడ్డా సినిమాను ఫ్లాప్ సినిమాగా చూడకూడదని పెట్టుబడిగా చూడాలని నాగచైతన్య చెప్పుకొచ్చారు.
లాల్ సింగ్ ఛడ్డా హిందీ వెర్షన్ మాత్రమే నేను చూశానని తెలుగు వెర్షన్ చూడలేదని నాగచైతన్య పేర్కొన్నారు. సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుందని సినిమాకు అలాంటి ఫలితం వచ్చినంత మాత్రాన సాకులు చెప్పనని ఆయన కామెంట్లు చేశారు. అమీర్ ఖాన్ వల్లే ఆ ప్రాజెక్ట్ లో నేను నటించానని నాగచైతన్య పేర్కొన్నారు. అమీర్ ఖాన్ తో ట్రావెల్ చేయాలనే కోరికతో లాల్ సింగ్ ఛడ్డా మూవీలో నటించానని ఆయన చెప్పుకొచ్చారు.
అమీర్ ఖాన్ తో 2 రోజులు ట్రావెల్ అయినా చాలని ఆయన నుంచి చాలా విషయాలను నేర్చుకోవచ్చని నాగచైతన్య చెప్పుకొచ్చారు. అమీర్ ఖాన్ తో ఆరు నెలలు ప్రయాణం చేసే ఛాన్స్ దక్కిందని ఈ ప్రయాణంలో నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చైతన్య తెలిపారు. లాల్ సింగ్ ఛడ్డా సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా ఆ సినిమా వల్ల వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మారిన మనిషిలా నేను బయటకు వచ్చాయని చైతన్య కామెంట్లు చేశారు.
నాగచైతన్య (Naga Chaitanya) చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్లాపైన సినిమాలను ఫ్లాప్ అయ్యాయని ఒప్పుకోవడం కొందరికే సాధ్యమని ఈ విషయంలో చైతన్య గ్రేట్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?