Naga Chaitanya: ‘భూల్ భులాయా 2’ రీమేక్ లో ఫైనల్ అయ్యేది ఎవరబ్బా..!

బాలీవుడ్ ఓ హిట్టు కోసం కరువాసిపోయున్నప్పుడు రెండొంద‌లు కోట్లు కలెక్ట్ చేసి ఊపిరి పోసింది ‘భూల్ భులాయా 2’. బాలీవుడ్లో భారీ విజయం సాధించిన మూవీ ఇది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జ్ఞాన‌వేల్ రాజా రీమేక్ రైట్స్ ను ద‌క్కించుకొన్నారు. ‘రాక్షసుడు’ ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. రీమేక్ చిత్రాలను తెరకెక్కించడంలో ఇతను స్పెషలిస్ట్. అందుకే ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేసే అవకాశం రమేష్ వర్మకి దక్కింది.

అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాలో హీరోగా నటించే హీరో ఎవరు అన్నది మాత్రం ఇంకా తేలలేదు. మొన్న నాగ చైత‌న్య ఈ రీమేక్లో నటించడం లేదు అంటూ అతని టీం ప్రకటించింది. నిజానికి ఈ రీమేక్ విషయంలో నాగ చైతన్య ప్రవస్తావన ఎక్కడా వచ్చింది లేదు. కానీ నాగ చైతన్య (Naga Chaitanya) టీం పనిగట్టుకుని క్లారిటీ ఇచ్చింది. దాని వెనుక కథేంటో ఎవ్వరికీ తెలీదు కానీ..

ముఖ్యంగా ఈ రీమేక్ విషయంలో హీరోలుగా అనుకున్నది … కళ్యాణ్ రామ్, వ‌రుణ్‌తేజ్‌, నితిన్‌ లను మాత్రమే. ఈ ముగ్గురు కూడా ఈ రీమేక్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఈ రీమేక్ లో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మార్పులు కనుక చోటు చేసుకుంటే నితిన్ వద్దకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారు అన్నది తెలియాల్సి ఉంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus