తన తల్లితో సమంత ఎలా ఉంటుందో చెప్పిన నాగ చైతన్య
- June 6, 2017 / 07:11 AM ISTByFilmy Focus
టాలీవుడ్ క్రేజీ ప్రేమికులు నాగ చైతన్య, సమంతలు అక్టోబర్ లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. తన పెద్ద కొడుకు వివాహ వేడుకను వైభవంగా నిర్వహించాలని అక్కినేని నాగార్జున ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు తనకు కాబోయే కోడలితో ముందుగానే మామ అని పిలిపించుకుని.. ఆ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఇక మీడియాకి దూరంగా ఉండే తన తల్లి లక్ష్మి, కోడలు సమంత గురించి ఏమంటుందో చైతూ రీసెంట్ గా వివరించారు. అతను నటించిన తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం విజయోత్సవ ఇంటర్వ్యూ లో అమ్మ, సమంత రిలేషన్ షిప్ గురించి పలు ఆసక్తికర సంగతులు వెల్లడించారు.
‘‘అమ్మ, సమంత బెస్ట్ ఫ్రెండ్స్. రోజూ వాళ్లు గంటలకొద్దీ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇండియాకు వచ్చినప్పుడల్లా అమ్మ, సమంతను చెన్నైలో కలుసుకుని ఎంజాయ్ చేస్తుంటారు.” అని నాగచైతన్య వివరించారు. నాగచైతన్యకు మంచి భార్య గానే కాకుండా అక్కినేని ఇంట మంచి కోడలిగాను పెళ్లికి ముందే సమంత పేరు తెచ్చుకుంటోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















