Hanu Man: హనుమాన్ కు నాగచైతన్య అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

  • January 22, 2024 / 03:14 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన అక్కినేని నాగచైతన్య కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చైతన్య తండేల్ సినిమాలో నటిస్తుండగా గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో 80 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే సాధారణంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి ఇష్టపడని నాగచైతన్య హనుమాన్ సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మకు శుభాకాంక్షలని చైతన్య అన్నారు.

ప్రశాంత్ వర్మ ఎంచుకున్న కాన్సెప్ట్, రచనలో కొత్తతరం ఆలోచనలు ప్రతిబింబించాయని ఆయన చెప్పుకొచ్చారు. హనుమాన్ సినిమా మొత్తం గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని తేజ సజ్జా తన నటనతో మెప్పించేలా నటించాడని చైతన్య కామెంట్లు చేశారు. హనుమాన్ కు చైతన్య ఇచ్చిన రివ్యూ ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో నాగచైతన్య ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా (Hanu Man) వస్తుందేమో చూడాల్సి ఉంది.

చైతన్య తండేల్ సినిమా విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది. తండేల్ మూవీ నుంచి ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ కాగా ఆ గ్లింప్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో చైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తున్నారు. చైతన్య సాయిపల్లవి కాంబో హిట్ కాంబో అనే సంగతి తెలిసిందే. నాగచైతన్య రెమ్యునరేషన్ 12 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.

తండేల్ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తండేల్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. తండేల్ మూవీ ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. చైతన్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. చైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus