Naga Chaitanya: చైతన్య పాత్ర నిడివి అంత తక్కువా?

అక్కినేని హీరో నాగచైతన్య సినిమా కథల ఎంపిక విషయంలో మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైతన్య అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య ఈ మూవీతో సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాలో చైతన్య సైనికుడి పాత్రలో నటిస్తున్నారని ఇప్పటికే రిలీజైన ఫోటోల ద్వారా అర్థమవుతోంది.

ఈ మూవీ హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ కాగా ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న పాత్రను లాల్ సింగ్ చద్దా మేకర్స్ మొదట విజయ్ సేతుపతికి ఆఫర్ చేశారని సమాచారం. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేయడంతో చైతన్య ఆ పాత్రకు ఎంపికయ్యారని ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తోంది. ఒరిజినల్ లో ఉండే బబ్బా అనే రోల్ లో చైతన్య నటిస్తున్నారని సమాచారం.

అమాయకత్వంలో, విచిత్రమైన హావభావాలను ప్రదర్శించేలా చైతన్య రోల్ ఉంటుందని తెలుస్తోంది. చైతన్య పాత్రకు పెద్ద ఓడను కొనుగోలు చేసి సముద్రంలో చేపలు పట్టాలనే కల ఉంటుందని అయితే ఆ పాత్ర చనిపోతుందని తెలుస్తోంది. నాగచైతన్య పాత్ర నిడివి సినిమాలో కేవలం అరగంటే అని సమాచారం. అయితే సినిమాలో హీరో తర్వాత ఆ స్థాయి పాత్ర కావడం, అమీర్ ఖాన్ హీరో కావడంతో చైతన్య ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus