Naga Chaitanya: చైతు లిస్ట్ లో మరో సినిమా..?

అక్కినేని నాగచైతన్య రీసెంట్ గా ‘థాంక్యూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం చైతు.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్ రోల్ పోషిస్తున్నారు. అలానే ప్రేమి విశ్వనాధ్, ప్రియమణి లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో జరుగుతుంది.

రీసెంట్ గా చైతు మరో సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల.. చైతుని కలిసి ఓ కథ చెప్పారట. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట. వేణు ఊడుగుల నేరేషన్ చైతుకి నచ్చడంతో ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించబోతోంది. వేణు ఊడుగుల నుంచి చివరిగా ‘విరాటపర్వం’ అనే సినిమా వచ్చింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆడలేదు. ఓటీటీలో మాత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు చైతుతో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. దీంతో పాటు పరశురామ్ తో కూడా సినిమా చేయబోతున్నారు చైతు. కానీ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో తెలియడం లేదు.

దీనికి ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. నిజానికి వెంకట్ ప్రభు సినిమా కంటే ముందు పరశురామ్ సినిమా మొదలుపెట్టాల్సింది కానీ ఎందుకో ఆలస్యమవుతుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus