కొత్త ఉత్సాహంతో కలిసి నటించనున్న నాగచైతన్య, సమంత!

“ఏ మాయ చేశావే”, “ఆటో నగర్ సూర్య”, “మనం” సినిమాలతో నాగచైతన్య, సమంత జంట హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకుంది. ఇవన్నీ వీరిద్దరూ పెళ్లికాకముందటి సినిమాలు. పెళ్లి తర్వాత తొలిసారి  శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నారు. నిన్నుకోరి” హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న ఈ డైరక్టర్… హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మాణంలో ఈ మూవీ చేయనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత కుటుంబసభ్యులతో కలిసి విదేశాల్లో విహరిస్తున్నారు. అందుకే డైరెక్టర్ వారిద్దరూ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. టూర్ నుంచి తిరిగి రాగానే షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

ఇందులో సమంత, నాగచైతన్యలు భార్య భర్తలుగానే కనిపించనున్నారు. సినిమాలో పెళ్లి తర్వాత వీరి మధ్యలోకి ఓ అమ్మాయి వస్తుందని.. ఆమె వల్ల ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఆ పాత్రను హిందీ నటి దివ్యంశ కౌశిక్ పోషించబోతున్నట్టు తెలిసింది. రావు రమేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటించనున్న ఈ సినిమాకి “మజిలి” అనే పేరుని రిజిస్టర్ చేసింది. తమిళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఆకట్టుకుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus