వాళ్ళ ప్రేమ అప్పుడే మొదలయిందట!!!

టాలీవుడ్ లో చాలా మంది ప్రేమలో పడి పెళ్ళిళ్ళు చేసుకున్నారు…అయితే అప్పుడెప్పుడూ లేనంత హైప్, రూమర్స్, ఇప్పుడు ఎవరైనా ప్రేమలో పడితే ఇట్టే వచ్చేస్తుంది అని అనడానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే అదే క్రమంలో ఇప్పుడు తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ప్రేమ కధ ‘సమంత-చైతు’ది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే తాజాగా వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్ళికి సిద్దం అవుతున్నారు అని టాలీవుడ్ కోడై కూస్తుంది. ఇక తాజాగా జరిగిన ఒక సంఘటన ఈ ప్రేమ ప్రయాణానికి మరింత ఊతమిస్తుంది…అదేంటి అంటే…తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త…నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె పెళ్ళికి కుమారినితో పాటు, సమంతను కూడా వెంటబెట్టుకుని వెళ్లాడు నాగ్. అంతేకాకుండా నాగార్జునే స్వయంగా సమంతను, చైతన్యను సచిన్‌కు పరిచయం చేశాడు.

ఆయన సమంతను ఏ వరుసతో పరిచయం చేసాడో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అయితే అసలు ఈ ప్రేమ కధ ఇప్పటిది కాదు, దాదాపుడా రెండు ఏళ్ల క్రితమే ఈ ప్రేమ వ్యవహారం మొదలయింది అని, అదే….ఎప్పుడు అంటే…మూడుతరాల అక్కినేని వైభవం ఒకే ఫ్రేమ్‌లో చక్కగా ఒదిగిపోయిన ‘మనం’ సినిమాలో నాగచైతన్య భార్యగా సమంత నటించిన విషయం తెలిసిందే. 2014లో వచ్చిన ఈ ఫాంటసీ డ్రామా ఫిల్మ్ టాలీవుడ్‌లోనే ‘మూడు తరాల’ మొదటి చిత్రం. ఇక ఈ చిత్రం సమయంలోనే వాళ్ళిద్దరూ లవ్ లో పడటం, అదే క్రమంలో ఈ విషయం నాగ్ కు తెలియడం, అంతా ఒప్పుకోవడం జరిగిపోయిందట. మొత్తానికి పూర్తిస్థాయి అక్కినేని కుటుంబ చిత్రం పుణ్యమా అని మన చైతు…ఒక ఇంటి వాడు కాబోతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus