చందుతో సినిమా విషయంలో సంచలన కామెంట్స్ చేసిన నాగచైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మంచి జోష్ లో ఉన్నారు. వరుసగా విజయాలతో మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నారు. శైలజా రెడ్డి అల్లుడు మూవీ కంటే ముందు అతను మొదలు పెట్టిన “సవ్యసాచి” రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. “నాకు 100% లవ్ చిత్రంతో సక్సెస్ ను ఇచ్చిన సుకుమార్ గారు ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేసేందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ‘సవ్వసాచి’ చిత్రం కథ నాకు చాలా బాగా నచ్చి చేస్తున్నాను. దర్శకుడు చందుతో నేను ‘ప్రేమమ్’ చిత్రాన్ని చేశాను. ఆ చిత్రం రీమేక్ అస్సలు వద్దంటూ చాలా మంది అన్నారు.

అయినా కూడా నా కోసం ఆ సినిమా రీమేక్ చేసేందుకు చందు ముందుకు వచ్చాడు. ఆ సినిమా నా కెరీర్ లో పెద్ద విజయాన్ని ఇచ్చింది. ఆ సినిమా షూటింగ్ నార్వేలో జరుగుతున్న సమయంలో చందు నాకు ఈ స్టోరీ లైన్ ను చెప్పాడు. అప్పుడే ఇది నాతో చేయమని అడిగితే బాగోదని అనుకున్నాను. ‘ప్రేమమ్’ విడుదలైన తర్వాత కొన్నాళ్లకు చందు నా వద్దకు వచ్చి అప్పుడు చెప్పిన కథతో సినిమా చేద్దామని చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను” అని వివరించారు. మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఈ మూవీ నవంబర్ 2న రిలీజ్ కాబోతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా, మాధవన్ విలన్ గా చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus