పంజాబీ ఫిలిం కి ఒకే చెప్పిన చైతూ

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫుల్ జోష్ మీదున్నారు. వరుసగా సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అతను నటించిన “సాహసమే శ్వాసగా సాగిపో” సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. ఏ మాయ చేసావే కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం చైతూ ప్రేమమ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మలయాళం ప్రేమమ్ మూవీకి రీమేక్ అయినా ఇందులో నాగ చైతన్య ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఈ సినిమా పూర్తి అయినా వెంటనే మరో చిత్రం సెట్స్ మీదకు వెళ్లేలా యువ సామ్రాట్ సన్నాహాలు చేస్తున్నారు. పంజాబీ ఫిలిం “జట్ అండ్ జూలియట్” నచ్చడంతో దానిని రీమేక్ చేయాలని చైతూ ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. రొమాంటిక్ కామెడీ ఎంటైర్ టైనర్ గా యువతని అలరించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించనున్నారు.  దర్శకుడు కృష్ణ “జె & జె” చిత్రాన్ని తెలుగువారికి మెచ్చేలా, కథకి మన ఫ్లేవర్ అద్దె పని మొదలు పెట్టారని,  నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లవచ్చని ఫిలింనగర్ వర్గాల సమాచారం. తమ్ముడు అఖిల్ ఏడాది సమయంలో ఒక సినిమాకు ఒకే చెప్పలేక పోతుంటే.. అన్న చైతూ మాత్రం మూడు చిత్రాలకు ఓకే చెబుతూ దూసుకుపోతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus