అన్నయ్య వెనక్కి.. తమ్ముడు ముందుకి..!

వరుసగా రెండు సూపర్ హిట్లు అందుకుని మంచి ఫామ్లో ఉన్నాడు అక్కినేని నాగ చైతన్య. ఇక ఆయన నుండీ రాబోతున్న తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. ‘ఫిదా’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న చిత్రం కావడం.. అందులోనూ సాయి పల్లవి హీరోయిన్ కావడంతో ఈ చిత్రం పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఇటీవల విడుదల చేసిన ఓ వీడియో ప్రోమోకి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14లేదా 16 తేదీలకు విడుదల చెయ్యాలి అని చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేశారు. కానీ చాలా వరకూ షూటింగ్ పెండింగ్ ఉండడంతో అది కుదిరేలా లేదట. దీంతో అనుకున్న డేట్ కు ఈ చిత్రం వచ్చే ఛాన్స్ లేదనేది స్పష్టమవుతుంది.

అయితే ఆ డేట్ ను అలా ఖాళీగా వదిలెయ్యడం ఎందుకు అని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్ర యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎలాగైనా అన్నయ్య కర్చీఫ్ వేసుకున్న డేట్ లను తమ్ముడి సినిమాకి కేటాయించి క్యాష్ చేసుకోవాలని ‘జిఏ2 పిక్చర్స్’ వారు భావిస్తున్నారట. దీంతో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.. అండ్ టీం చిత్రీకరణను వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇలా అయినా తమ్ముడి సినిమాకి కలిసొచ్చి హిట్ అందిస్తుందేమో చూడాలి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus