Naga Chaitanya: రానా చెల్లెలి కూతురితో నాగ చైతన్య.. వైరల్ అవుతున్న ఫోటోలు..

టాలీవుడ్‌లో అక్కినేని – దగ్గుబాటి కుటుంబాల రిలేషన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఏఎన్నార్, రామా నాయుడు లాంటి లెజెండ్స్‌కి చెందిన ఈ కుటుంబాల నుండి సినిమా పరిశ్రమలో రెండు తరాలుగా రాణిస్తున్న వారసులున్నారు. నాగేశ్వరరావు కొడుకు, మనవళ్లు హీరోలుగా సత్తా చాటుతున్నారు. రామా నాయుడు నిర్మాతగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. రెండో కొడుకు స్టార్ హీరోగా, పెద్ద కొడుకు స్టార్ ప్రొడ్యూసర్‌గా ఆయన పేరు నిలబెట్టారు. సురేష్ బాబుకి రానా, అతని తమ్ముడు అభిరామ్ ఉన్నారని తెలుసు కానీ..

మాళవిక అనే కూతురున్నట్టు చాలా మందికి తెలియదు. ఎందుకంటే దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్స్.. తమ సినిమా అప్‌డేట్స్ అప్పుడు తప్పితే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. ఇక రానా చెల్లెలు మాళవిక పెళ్లి తర్వాత బెంగుళూరులో ఉంటున్నారు. ఆమెకు ఐరా అనే పాప ఉంది. నాగ చైతన్య, ఐరాతో కలిసి ఉన్న కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో సమంత ఈ పిక్స్ షేర్ చేశారు కానీ అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఐరా భలే క్యూట్‌గా ఉందంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus