నాగచైతన్య కొత్త సినిమా మొదలైంది!
- April 23, 2016 / 10:14 AM ISTByFilmy Focus
అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన నేటి తో 100 రోజులు పూర్తి చేసుకుంది. నాగార్జునకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో.. నాగచైతన్య తదుపరి చిత్రం ప్రారంభం అయ్యింది.
అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించారు. నాగచైతన్య ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉండటం వలన చిత్ర ప్రారంభోత్సవానికి రాలేకపోయాడు. నాగార్జున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాగార్జునే నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య నటిస్తున్న చిత్రాల్లో.. “సాహసం శ్వాసగా సాగిపో” మే 27న విడుదల కానుండగా.. “ప్రేమమ్” జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











