Naga Shaurya, Anusha Shetty: ఘనంగా నాగశౌర్య, అనూష శెట్టి వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఎట్టకేలకు బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో వీరి వివాహాన్ని నేడు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఎంతో ఘనంగా జరుపుకున్నారు. బెంగళూరులోని ఒక హోటల్లో నేడు 11:25 గంటలకు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో అనూష శెట్టి మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇక నిన్నటి నుంచి నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫోటోలు అన్నింటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈయన హల్దీ ఫంక్షన్ ఫోటోలు అలాగే పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

నాగశౌర్య వివాహానికి టాలీవుడ్ కి చెందిన పలువురు సినీ సెలెబ్రెటీలు కూడా హాజరయ్యి నూతన దంపతులను ఆశీర్వదించారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం నాగశౌర్య అనూష శెట్టి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఇలా పెద్దల సమక్షంలో ఈ హీరో ఎంతో అంగరంగ వైభవంగా తన వివాహాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం ఈయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అనూష శెట్టి గులాబీ రంగు చీర కట్టుకొని ఎంతో అందంగా ముస్తాబై ఉండగా నాగశౌర్య మాత్రం పట్టు పంచ ధరించారు.

ఇలా సాంప్రదాయబద్ధంగా వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది.ఇక ఈయన పెళ్లి ఫోటోలు వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

1

2

3

4

More..

1

2

3

4

5

6

7

8

 

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus