Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » శౌర్య ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందా..?

శౌర్య ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందా..?

  • March 3, 2021 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శౌర్య ప్రాజెక్ట్ ముందుకు కదులుతుందా..?

చాలా రోజులుగా నాగశౌర్యకి సంబంధించిన ఓ ప్రాజెక్ట్ వార్తల్లో నలుగుతోంది. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథ శౌర్యకి బాగా నచ్చింది. శివలెంక కృష్ణ ప్రసాద్ అనే బడా నిర్మాత ఈ కథను నిర్మించాలని చూస్తున్నారు. ఇది ఇద్దరు హీరోల కథ. ఓ పాత్ర కోసం అగ్ర హీరో కావాల్సివుంది. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కి, హీరో బాలకృష్ణకి మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో బాలయ్య నటించిన ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ లాంటి సినిమాలను నిర్మించింది ఈయనే. అయితే ‘మిత్రుడు’ సినిమాతో నష్టాలు ఎక్కువగా రావడంతో.. అప్పటినుండి శివలెంక కృష్ణప్రసాద్ కు మరో సినిమా చేసి పెట్టాలని బాలకృష్ణ అనుకుంటూనే ఉన్నారు.

అందుకే ఈ ఈ కథ ముందుగా బాలయ్య దగ్గరకు వెళ్లింది. ఈ సినిమాలో నటిస్తానని బాలయ్య కూడా మాటిచ్చాడు. కానీ తన బిజీ కాల్షీట్ల వలన బాలయ్యకు కుదరడం లేదు. దీంతో ఈ కథ నాగార్జున దగ్గరకు వెళ్లింది. నాగ్ కూడా ముందు ఓకే చెప్పినా.. ఇప్పుడు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం నాగ్ చేతుల్లో రెండు సినిమాలు ఉన్నాయి. ముందుగా.. ప్రవీణ్ సత్తారు సినిమాను పూర్తి చేయాలి. ఆ తరువాత ‘బంగార్రాజు’ సినిమా లైన్ లో ఉంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికే తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇవి కాకుండా జూన్ లో బిగ్ బాస్ కూడా మొదలవుతోంది. దానికి కూడా కాల్షీట్లు కేటాయించాలి. ఎలా చూసుకున్నా.. శౌర్యతో సినిమా చేయడానికి నాగ్ కి కుదరడం లేదు. దీంతో నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మళ్లీ బాలయ్య దగ్గరికే వెళ్లినట్లు తెలుస్తోంది. ఎలాగైనా తనకు ఈ సినిమా చేసి పెట్టాలని నిర్మాత కోరుతున్నాడట. శౌర్య కూడా ఈ సినిమా విషయంలో ఉత్సాహం చూపిస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందో చూడాలి!

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #krishna Prasad
  • #Naga Shourya
  • #nagarjuna

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

19 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

20 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

23 mins ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

1 hour ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

2 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

5 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version